చరిత్ర అధ్యయనం అనేది, ఒక దట్టమైన గుహలో ప్రవేశించడం లాంటిదే

 

చరిత్ర అధ్యయనం అనేది, ఒక దట్టమైన గుహలో ప్రవేశించడం లాంటిదే     


          చరిత్ర అధ్యయనం అనేది, ఒక దట్టమైన అడవిలోని గుహ లో ప్రవేశించడం లాంటిది. గుహలో ప్రవేశించేముందు ప్రారంభంలో వెలుతురూ ఉంటుంది. లోపలి వెళ్తూవుంటే, దట్టమైన చీకటి, నడకలో పాములు, ప్రమాదకర అంశాలు ఉంటాయి. వీటన్నింటి తట్టుకొని ముందుకు సాగితేనే, అధ్యయనం సాఫీగా సాగుతుంది*  అని ప్రముఖ సాహితీ వేత్త, చరిత్ర కారులు డా. సంగనబట్ల నర్సయ్య పేర్కొన్నారు. ఆయన రాసిన తెలంగాణా ప్రాచీన చారిత్రక వ్యాసాల కూర్పు 'కోటిలింగాలు' పుస్తకావిష్కరణ శనివారం నాడు సాయంత్రం రవీంద్ర భారతీలో జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి డా. కేవీ రమణాచారి, డా. శ్రీ రంగాచార్య, డా. కసిరెడ్డి వెంకట రెడ్డి, ఆర్వీ రామా రావు, డా. శివ నాగిరెడ్డి, కస్తూరి మురళీ కృష్ణ, అవుసలి భానుప్రకాష్, డీ. సత్యనారాయణలతో పాటు ఎంతో మంది సాహితీ వేత్తలు, చరిత్ర కారులు హాజరయ్యారు. ఈ పుస్తకావిష్కరణ అనంతరం డా. సంగనబట్ల ప్రసంగించారు. తానూ పుట్టిన ధర్మపురి లోనే పాఠశాల విధ్యాబ్యాసం, ఉద్యోగం కూడా, ధర్మపురి ప్రాచ్య ఆంద్ర కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రిసిపాల్ గా అరవై ఏళ్ళు వచ్చే వరకు పనిచేయడం విశేషమని, అది ఆ ధర్మపురి నారసింహస్వామి కృపయే కారణమని అన్నారు. తానూ రాసిన చారిత్రక వ్యాసాల గురించి, వాటి శోధనకు పడ్డ కస్టాలు, చేసిన అధ్యయనం గురించి వివరించారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వెళ్లడం వల్ల ప్రధాన అతిధుల ఉపన్యాసాలు మిస్సయ్యాను. 

--------ఎండ్స్ 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు