ప్రధాన మంత్రి నరేంద్ర మోది (Narendra Modi) పరమాత్మున్ని ఉటంకిస్తు చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధి(Rahul Gandhi) ఫిట్టింగ్ కౌంటర్ ఇచ్చాడు.
'ఆ పరమాత్ముడే నన్ను ఇక్కడకు పంపాడు'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధి స్పందిస్తూ అవును గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలకు సాయం చేసేందుకే ఆయనను పరమాత్మ (god) పంపారని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, రైతులు, కార్మికులకు సేవలు అందించేందుకు మోదీని భగవంతుడు ఇక్కడకు పంపలేదన్నారు.
''ఆ పరమాత్ముడే నన్ను ఇక్కడకు పంపాడు'' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిప్పికొట్టారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తలకు సాయం చేసేందుకే ఆయనను పరమాత్మ (God) పంపారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియాలో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ, రైతులు, కార్మికులకు సేవలందించేందుకు మోదీని భగవంతుడు పంపలేదన్నారు.
''అందరూ జీవిసంబంధితులే. మోదీ మాత్రం అలా కాదు. ఆయనను అంబానీ, అదానీలకు సాయం చేయడం కోసం పరమాత్మ ప్రత్యేకంగా పంపించాడు. రైతులు, కార్మికులను ఆదుకునేందుకు కాదు. ఆయనను పరమాత్మే పంపించి ఉంటే పేదలు, అన్నదాతలను ఆదుకుని ఉండేవారు. అలా కాదంటే ఆయన ఏ తరహా పరమాత్ముడని అనుకోవాలి? మోదీకి చెందిన పరమాత్ముడుగానే అనుకోవాలి'' అని రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 'అగ్నిపథ్' పథకాన్ని చెత్తకుప్పలో పడేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ పరిమితికి చరమగీతం పాడతామని స్పష్టం చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box