ఎమ్మెల్సి ఎన్నికల బరిలో క్రాతి కుమార్ - గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి

 ఉద్యమకారున్ని గెలిపించండి
ప్రధాన పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు



   తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొని, సామాజికన్యాయం కోసం పోరాటం చేస్తూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను తాడిశెట్టి క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం పరకాల మండల కేంద్రంలో కరపత్రాలు పంచి ప్రజా సంఘాల నాయకులతో కలిసి అమరధామం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎంతో చైతన్యంతో ప్రభుత్వాలను మార్చిన పాలనలో, దోపిడీలో మార్పు రావడం లేదని, ప్రధాన పార్టీలో పోటీలో పెట్టిన అభ్యర్థులను ఓడించి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే పెద్దల సభలో సామాజిక దృక్పధం కలిగిన వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి, రైతుల సంక్షేమం గురించి శాసనమండలిలో మాట్లాడే అవగాహన, చిత్తశుద్ధి ఉన్న నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ గడిచిన పదేండ్లు రాష్ట్రాన్ని నాశనం చేసి పార్టీ ఫిరాయింపులకు ప్రధాన కేంద్రంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని, దేశంలో మతాల మారణహోమం సృష్టిస్తూ మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపుతూ, ప్రశ్నించే గొంతుకలను అర్బన్ నక్సల్ పేరుతో అక్రమంగా జైళ్ళలో పెడుతున్న బిజెపి పార్టీని చిత్తుగా ఓడించాలని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బి.సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ ఊసే తీయడం లేదని, బి.సి లకు మోసం చేయచూస్తున్న కాంగ్రెస్ ను కూడా పట్టభద్రులు ఓడించాలని, సామాజికన్యాయం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చే విజన్ కలిగిన విద్యావంతుడు తారిశెట్టి క్రాంతికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష రాజకీయాలు అవినీతిమయమై, ప్రజల సమస్యలను కనీసంగా కూడా పట్టించుకోని నేటి స్థితిలో పెద్దల సభలో మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రవేశించి ప్రజల సమగ్ర అభివృద్ధికి సూచనలు ఇచ్చి, చట్టాలు చేపించి ప్రజల అభివృద్ధికి కృషి చేయడం కోసం ఈ శాసన మండలి ప్రముఖ పాత్ర వహించే సభలో కూడా అలవికాని వాళ్ళు పోటీలో ఉండడాన్ని ప్రజలు వ్యతిరేకించి ఓడించాలని పిలుపునిచ్చారు. 

    ఈ కార్యక్రమంలో తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వరికెల కిషన్ రావు, కోగిల కిరణ్ తేజ్ మహరాజ్, నలుబోల సంజయ్ కుమార్, బుక్యా రాకేష్ సామాజిక ఉద్యమకారుడు పెండ్యాల సుమన్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

----Ends

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు