కిట్స్ లో క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-క్వెస్ట్-2024 ప్రారంభం

 


కిట్స్ వరంగల్ లో " క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-క్వెస్ట్-2024”  పై ఒక వారం పాటు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌"(యఫ్ డి పి) సోమవారం ప్రారంభించారు. 

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ (పి ఎస్), కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ వరంగల్ మరియు సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (సిటి యల్),నిట్ వరంగల్  (PMMMNMTT పథకం  విద్యా మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయబడింది)  సంయుక్తంగా *“క్వాంటమ్ ఎనేబుల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-క్వెస్ట్-2024”  పై ఒక వారం పాటు ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను 2024  మే 20  నుండి 24 వరకు,  కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు.

 హైదరాబాద్ డి ఆర్ డి ఓ, రీసెర్చ్ సెంటర్, టెక్నాలజీ డైరెక్టర్, సైంటిస్ట్ జి, డా. జి మల్లికార్జునరావు, గౌరవ అతిథి ఈ సి ఈ ప్రొఫెసర్ & హెడ్ సి టి యల్ నిట్ వరంగల్ ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ మరియు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక రెడ్డి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైదరాబాద్‌ డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రం, టెక్నాలజీ డైరెక్టర్‌ జి, సైంటిస్ట్‌ డాక్టర్‌ జి. మల్లికార్జునరావు మాట్లాడుతూ క్వాంటం మెకానిక్స్‌ సూత్రాల ఆధారంగా అధునాతన సాంకేతికతలను రూపొందించి అభివృద్ధి చేశారన్నారు.  యఫ్ డి పి  థ్రస్ట్ ఏరియస్: వరుసగా క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీని అన్వేషించడం (రోజువారీ జీవితంలో); క్వాంటం కంప్యూటింగ్ పరిచయం; క్వాంటం కెమిస్ట్రీ- మాలిక్యులర్ సిమ్యులేషన్; సెన్సార్ అనువర్తనాల కోసం నానో పదార్థాలు; నానో సృక్చర్డ్ థిన్ ఫిల్మ్స్ మరియు దాని అప్లికేషన్లు; అధిక సామర్థ్యం గల శక్తి మార్పిడి- సౌర ఘటాలు; క్వాంటం ఆప్టిక్స్ - నానో ఫోటోనిక్స్;ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలు: మెడికల్ ఐ ఒ టి పరికరాలు మరియు సెన్సార్లు; శక్తి నిల్వ పదార్థాలు: నానో ఎలక్ట్రానిక్ పరికరాలలో బ్యాటరీలు & సూపర్ కెపాసిటర్లు మరియు క్వాంటం రవాణా మొదలగునవి. చాలా నిబద్ధత, నైపుణ్యం అవసరమయ్యే క్వాంటం ఎనేబుల్డ్ సైన్స్ & టెక్నాలజీని బోధించడం మరియు నేర్చుకునే సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా కొనసాగించాలి  అన్నారు. 


ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యలో క్వాంటమ్ ఎ ఐ డిజైన్ యొక్క పాఠ్యాంశాలు కరికులం లో చేర్చడం వల్ల అవి విధ్యార్ధులు జీవితం లో కీలక పాత్ర పోషిస్తాయని  అన్నారు.


 ఈ కార్యక్రమంలో  గౌరవ అతిథిగా పాల్గొన్న నిట్ వరంగల్ ఈ సి ఈ విభాగపు ప్రొఫెసర్ & హెడ్, సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (సిటి యల్), ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ మాట్లాడుతూ యఫ్ డి పి యొక్క ప్రధాన లక్ష్యం వారి బోధనలో క్వాంటం సైన్స్ మరియు సాంకేతికతలను ఉపయోగించుకునేలా విజ్ఞానం మరియు నైపుణ్యాలను బలోపేతం చేయాలని అట్లాగే  పరిశోధన మరియు వృత్తిపరమైన అభివృద్ధి ప్రయత్నాలు జరగాలని అన్నారు.

 క్వాంటం మెకానిక్స్‌లో క్వాంటం సీయింగ్, క్వాంటం థింకింగ్, క్వాంటం ఫీలింగ్, క్వాంటం నోయింగ్, క్వాంటం యాక్టింగ్, క్వాంటం ట్రస్ట్టింగ్, క్వాంటం బీయింగ్ మరియు క్వాంటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ ఐ) వంటి ఏడు నైపుణ్యాలు ఉన్నాయని  పేర్కొన్నారు.

  వరంగల్‌ నిట్ లో సి టి యల్ శిక్షణా కేంద్రం ద్వారా మొత్తం 6000 మంది అధ్యాపకులు శిక్షణ పొంది ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ మాల్వియా నేషనల్ మిషన్ ఆన్  టీచింగ్ అండ్ టీచర్స్ (PMMMNMTT) పథకం కింద 10,000 మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని  ప్లాన్ చేస్తున్నామని, 


క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ మరియు క్వాంటం సూపర్‌పొజిషన్‌తో సహా సబ్‌టామిక్స్ యొక్క భౌతిక శాస్త్రంలో క్వాంటం మెకానిక్స్ సూత్రాలను ఉపయోగించడం అనేది  సాంకేతిక పరిజ్ఞానం  ఒరవడి అని వివిరంచారు.

ప్రిన్సిపల్ ప్రొ.కె.అశోక రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ క్వాంటం ఎనేబుల్డ్ టెక్నాలజీలకు సంబంధించి నైపుణ్యాలను సులభతరం చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సాంకేతికతలతో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి  యఫ్ డి పి  రూపొందించబడిందన్నారు.

 ఈ కార్యక్రమం అధ్యాపకులను వారి రంగాలలో తాజా పురోగతుల గురించి తెలుసుకునేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని.  యఫ్ డి పి  లకు హాజరు కావడం ద్వారా నైపుణ్యంతో కూడిన బోధన కారణంగా విద్యార్థులు అత్యధికంగా లబ్ధి పొందుతారని   నాణ్యమైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని, దీనికి ఆధునిక ఉపకరణాలు అవసరమని ఆయన వివరించారు. అంతేకాకుండా   బేసిక్ సాంకేతిక సమాచారం, పద్ధతులు మరియు రూపకల్పనకు విధానాలను అందించిడం, నూతన సాంకేతిక ఒరవడి ని సృష్టించే మెళకువలను సూచించారు.


ఈ కార్యక్రమంలో  కిట్స్ వరంగల్ రిజిస్ట్రార్,ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి & అసోసియేట్ ప్రొఫెసర్ డా. డి. ప్రభాకరా చారి, కోఆర్డినేటర్లు, డా. సి హెచ్. సతీష్ చంద్ర (భౌతికశాస్త్రంలో అసోసియేట్ ప్రొఫెసర్) & డాక్టర్ బంటీ రాయ్ (భౌతికశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్), ఇంగ్లీష్ ఫ్యాకల్టీ డాక్టర్ డా. గ్రేస్ శాంతి,    ఫిజికల్ సైన్సెస్  డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ వరుసగా డా. టి. మధుకర్ రెడ్డి, డా. హెచ్. రమేష్ బాబు, డా. ఎన్. మారాము, డా. కె. రాజేంద్ర ప్రసాద్, డా. వి. ప్రశాంత్ కుమార్, డా. పి. శ్రీనివాసరావు, డా. డి. మాధవి లత, డా. ఎ. ఎన్. మల్లిక, డా. ఎం. రణధీర్ కుమార్, డా. ఎం. గోపి కృష్ణ, డా. ఇ. . కళ్యాణ్ రావు, డాక్టర్ జి. శ్రీధర్, డాక్టర్ డి ప్రవీణ, డాక్టర్ వి సునీల్ కుమార్ మరియు అధ్యాపకులు మరియు సిబ్బంది 100 మంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు