_ఏమెఏమే భామ

 


*_ఏమెఏమే భామ..!_*

______________________

_జమునారాణి పుట్టినరోజు_

      _17.05.1938_

_______________________

ముక్కు మీద కోపం..

ముఖానికే అందం...

బుంగమూతి చందం..

నీ ముందరి కాళ్ల బంధం..


అభినయంలో 

జమున చెకుముకి..

గాత్రంలో జమునారాణి

చలాకి..ఆ పాటకే

మూగమనసులు సినిమాలో 

అంతులేని గిరాకీ..!


జమునారాణి..

మత్తుగా ఆమె వాణి..

చదువూ ఇదేనా..

మన వాసి వదిలేసి 

అసలు దొరల్లే సూటుబూటా

పార్వతి చిలిపిదనానికి..

సావిత్రి అభినయానికి

రాణి గాత్ర విన్యాసానికి

దేవదాసు..పైలా పచ్చీసు!


నాగమల్లి కోనలోన 

నక్కింది లేడికూన..

ఎరవేసి గురి చూసి

పట్టాలి మామా..

పట్టాలి మామా..!


మామా..మామా..మామా

ఏమె..ఏమే..భామా..


కంపు గొట్టు ఈ సిగిరెట్టు 

ఇది కాల్చకోయి నాపై ఒట్టు..

ఈ పాటలన్నీ జమునారాణి 

గొంతుతోనే హిట్టు...

ఓ రకమైన అల్లరి వాయిస్..

సంగీత దర్శకులకు 

నో చాయిస్..

మంచి బాణీ..

రాణి వాణి..

ఇక పాట పంచకళ్యాణి..

కలెక్షన్లు లేవందుకే

అని రేలం'గోడు' అన్నా

థియేటర్లు నిండింది

ఆ పాటల విందుకే!

************************


*సురేష్ కుమార్.elisetty*

     _9948546286_

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు