హనుమకొండ: వర్షాకాలం సమీస్తున్నందున నగరంలో పలు నాలాలపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిల పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
నయీమ్ నగర్ నాలాతో పాటు నాలాలపైన ఉండే వంతెనల నిర్మాణ పనులను జూన్ 15వ తేదీ నాటికి పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా లతో కలిసి నయీమ్ నగర్ నాలా నిర్మాణ పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై రెవెన్యూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, సర్వే విభాగం, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
నాలా అభివృద్ధి పనుల పురోగతి, ఎప్పటి వరకు అభివృద్ధి పనులను పూర్తి చేస్తారనే వివరాలతో పాటు నిర్మాణ పనులలో ఎదురవుతున్న ఇబ్బందుల పై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నాలా అభివృద్ధి పనులను
త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. నాలా అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఎన్నికలు ముగిసినందున ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని వెంటనే పరిష్కరించి నాలుగైదు రోజుల్లో నిర్మాణ పనులను ఎక్కడా కూడా ఆలస్యం చేయకుండా పనులను పూర్తి చేయాలన్నారు. నాలా పనులకు సంబంధించి సర్వే పూర్తి చేయాలన్నారు. మూడు రోజుల్లో సర్వే పనులను అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. సర్వే అనంతరం ఈ పనులపై మరోసారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈఈ రాజయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న, ఇరిగేషన్ ఈ ఈ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box