ఉమ్మడి కుటుంబాల ఊసేదీ..!?
జాయింట్ ఫ్యామి'లై'!
ఇప్పుడెక్కడి
ఉమ్మడి కుటుంబాలు
ప్రేమానురాగాలు ఇప్పుడు
సినిమా సన్నివేశాలు..!
*_తాతలు..నాన్నమ్మలు.._*
*_మామయ్యలు...అత్తలు.._*
*_బాబాయిలు..చిన్నమ్మలు.._*
*_అక్కలు..బావలు.._*
*_అన్నలు..వదినలు.._*
*_బావలు..బామ్మర్థులు.._*
ఇంకా దూరపు బంధువులు
ఆత్మీయులు..స్నేహితులు..
ఆపై..ఇరుగు..పొరుగు..
ప్రతి ఇల్లు ప్రేమాలయమే..
*_ప్రతి పండుగ బ్రహ్మోత్సవమే..!_*
ఏమైపోయాయి..ఆ ఇళ్లు..
కళకళలాడే లోగిళ్ళు..
బంధుమిత్రుల సందళ్లు..
సంక్రాంతి సంబరాలు..
ఉగాది ఉషోదయాలు..
దసరా సరదాలు..
పెళ్ళిళ్ళు..పేరంటాలు..
రోజూ సాగే కోలాటాలు..!
mummy..who is this uncle...!
ఇది కొన్ని కుటుంబాల్లో
సొంత బాబాయికి ఎదురయ్యే చేదు అనుభవం
daddy..how long this old man stays in our home using my washroom..
*_ఓ తాతకి మనవడి వాత!_*
అమ్మ పుట్టిల్లు మేనమామకు
ఎరుకా..ఒకనాటి మాట..
ఇప్పుడు ఆ మేనమామే
ఇరవై వచ్చాక పరిచయం..
అదీ వేరే వారి వేడుకలో..
*_అప్పుడో హాయ్..._*
*_ఆ వెంటనే బాయ్.._*
ఇవీ కుటుంబాలు..
మైక్రో ఫ్యామిలీలు..
ఆ"ధనిక" కవాలీలు.!
ఇల్లుల సైజు పెరిగి
ఆత్మీయతలు కరిగి
అనుబంధాలు తరిగి
ఎవరి గదుల్లో వారు..
భోజనాలు ఎక్కడి వారికక్కడే
కలిసినా అయిదు నిమిషాల్లో
కప్పల తక్కెడే..
ఇంట్లో ఉన్న నలుగురూ
కలిసేదీ గగనమే..
ఆ సమయంలో కాలం మందగమనమే..
ఎవరి పనుల్లో..
ఫోనుల్లో వారు బిజీ..
ప్రేమలు గజిబిజీ..!
*_ఒకనాటి పెళ్లిళ్లు_*
*_ఆనందాల వేదికలు.._*
ఎంత సందడి..
నెలల ముందే ఇంట్లో
అందరూ ఏర్పాట్లలో..
పిలుపులు..ప్రిపరేషన్లు..
షాపింగులు..
వంటలు..వార్పులు
పందిళ్ళు..భాజా భజంత్రీలు..
సరదాలు..సాంప్రదాయాలు..
ఇచ్చిపుచ్చుకోడాలు..
అప్పగింతలు..
కుప్పిగంతులు..
అవన్నీ ఇప్పుడెక్కడ..
*_రెడీమేడ్ బట్టలు..._*
*_ఈజీ మేడ్ ఏర్పాట్లు.._*
అప్పటికప్పుడు జరిగిపోయే వివాహాలు..
*_అంతకంటే వేగంగా_*
*_విడిపోయే బంధాలు.._*
ఉమ్మడి కుటుంబాలు
లేకనే ఈ దుర్గతి..
విలువలు అధోగతి..!
ఒకనాడు కుటుంబమంటే
*_చిన్న ప్రపంచం.._*
కలసి ఉంటే కలదు సుఖం..
మండువా లోగిలి..
ఆనందాల కౌగిలి..
ఆనాడు చిన్న కంపార్టుమెంట్
ఇప్పుడు ఓ బుల్లి అపార్ట్మెంట్
అందులోనూ ఎవరి గదుల్లో వారు బందీ...
అప్పుడే జరిగిపోయింది అనుబంధాల జమాబందీ..
తలరాతలు మారుతున్న కొద్దీ..
*_వృద్ధాశ్రమాల్లో రద్దీ..!_*
*_జగమంత కుటుంబాలు_*
అయ్యాయిప్పుడు ప్రేమాభిమానాలకు
జాగా లేని
ఇరుకు కదంబాలు!!
కుటుంబ దినోత్సవం సందర్భంగా..
మళ్లీ ఉమ్మడి కుటుంబాలు రావాలనే అసాధ్యమైన ఆశతో..
+++++++++++++++++
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
_9948546286_
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box