సెంటెనరి బాప్టిస్ట్ చర్చ్ కు ఎన్ఆర్ఐ శ్రీధర్ నీల విరాళం
వరంగల్ మండి బజార్ లోని నిజాంపుర సెంటెనరి ట్రినిటి బాప్టిస్ట్ చర్చిలో ఏసు క్రీస్తు శిలువ ఏర్పాటుకు ఎన్ఆర్ఐ శ్రీధర్ నీల విరాళం ఇచ్చి మతసామరస్యతను చాటుకున్నారు. వరంగల్ నగరానికి చెందిన శ్రీధర్ నీల లండన్ లో ఉంటున్నారు. వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం లండన్ యుకె అధ్యక్షులుగా ఉన్న శ్రీధర్ నీల పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ తన వంతు సహాయం చేస్తుంటారు. ఇందులో బాగంగా చర్చి లో ఏసు ప్రభువు శిలువకు వెండిపూత కోసం రూ. 50500 లు విరాళంగా ఇచ్చారు. శ్రీధర్ నీల చేసిన సహాయానికి సెంటెనరి ట్రినిటి బాప్టిస్ట్ చర్చి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియ చేశారు. శ్రీధర్ నీల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఆయన చేసిన సహాయాన్ని ప్రకటించి కృతజ్ఞతలు చాటుకున్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box