పేదోడికి న్యాయం చేసిన వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు
ఓ పేద వాడి ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన వారి నుండి తిరిగి ఆ స్థలాన్ని యజమానికి పోలీసుల ఇప్పించారు. మిల్స్ కాలని కాలనీ పోలీసులు చేసిన ఈ సహాయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ చింతల్ బ్రిడ్జ్ సమీపంలో ఇక్బాల్ అనే వ్యక్తి తన కూతురు వివాహం కోసం 1996లో 270 గజాల భూమి ని కొనుగోలు చేసాడు. ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఖబ్జా చేశారు. భాదితుడు పోలీస్ కమీషనర్ ను ఆశ్రయించడంతో కమీషనర్ ఆదేశాలతో మిల్స్ కాలని పోలీసులు రంగంలోకి దిగి కబ్జా దారుల నుండి తిరిగి ఇంటి స్థలాన్ని ఇప్పించారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా తమ భూమి తమకు రావడంతో భూ యజమాని ఇక్బాల్ ఆయన కూతురు కూతురు మిల్స్ కాలని సిఐ ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మీల్స్ కాలనీ సీఐ మాట్లాడుతూ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box