న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారాన్ని గమనిస్తున్నామని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కేజ్రీవాల్ కేసులో పారదర్శక, న్యాయబద్ధ, వేగవంతమైన విచారణ జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల శాఖకు సూచించినట్లు ఒక వార్తాసంస్థతో చెప్పారు. కాగా, ఇటీవలే కేజ్రివాల్ అరెస్టు విషయంలో జర్మనీ స్పందించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఈ విషయంలో విదేశీ వ్యవహారల శాఖ భారత్లోని జర్మనీ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఇది పూర్తిగా తమ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. ఈ క్రమంలోనే అమెరికా కూడా కేజీవాల్ అరెస్టుపై స్పందించడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా అధికారి వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.
కాగా, ముడుపులు తీసుకుని లిక్కర్ పాలసీ రూపొందించడంలో ప్రధాన పాత్ర అరవింద్ కేజ్రివాల్దేనన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చ్ 21న ఆయనను అరెస్టు చేసింది. తర్వాత ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ కేజ్రివాల్ను ప్రవేశపెట్టింది. కోర్టు కేజీవాలు మార్చ్ 28 దాకా ఈడీ కస్టడీకి ఇచ్చింది.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box