సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

 


ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్య


గాంధీ భవన్ - హైదరాబాద్  


   తెలంగాణ రాష్ట్ర వికలాంగుల ఫైనాన్స్ కో-ఆపరేటివ్ ఛైర్మన్ గా నియమించిందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన నివాసంలో గురువారం కలిసి ముత్తినేని వీరయ్య ధన్యవాదాలు తెలిపారు. సబ్బండ కులాల సంక్షేమం కోసం పాటుపడుతూ తెలంగాణలో ప్రజా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి కోరిక మేరకు పెరిక (పురగిరి క్షత్రియ) కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమస్త వికలాంగులు, సమస్త పెరిక కులస్తులు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని వీరయ్య తెలిపారు. 

   ఈ సందర్భంగా ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తేవాలని అన్నారు. వికలాంగుల, పెరిక కుల సంక్షేమం కోరకు నిరంతరము పని చేయాలని రేవంత్ రెడ్డి  సూచించినట్లు వీరయ్య తెలిపారు. ముఖ్యమంత్రి నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను నిర్వహించి వికలాంగుల సంక్షేమంతో పాటు పెరిక కుల సంక్షేమం కోసం కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తానని వీరయ్య తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు