స్వయం పాలన దిక్సూచి కామ్రేడ్ కుంజ రాము యాది సభ (మార్చ్ 27 న వర్ధంతి)

 


స్వయం పాలన దిక్సూచి కామ్రేడ్ కుంజ రాము యాది సభ (మార్చ్ 27 న వర్ధంతి) 


       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతము మహబూబాబాద్ జిల్లా లోని పాకాల కొత్తగూడా మండలం మోకాలపల్లి అనే ఆదివాసి గూడెంలో కోయ తెగకు చెందిన నిరుపేద కుటుంబంలో కుంజ రాము  జన్మించారు. చిన్ననాటి నుంచే ఆదివాసి ప్రాంతంలో ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి అణిచివేతను చూస్తూ ఎదిగాడు.ఆదివాసి ప్రాంతంలో జరుగుతున్న వనరుల దోపిడీ, అటవీ సంపద కొల్లగొడుతున్నటువంటి భూస్వామ్య ముకలపై నిరంతరం పోరు కొనసాగించాలని విప్లవ ఉద్యమమే సరియైన పంతాని యవ్వనంలోనే విప్లవ ఉద్యమానికి ఆకర్షితుడై అడవి బాట పట్టాడు.  అడవిలో ఉన్నప్పుడే తనని అనుసరించి వచ్చిన ధనసరి అనసూయ ( సీతక్క)ను వివాహమాడి విప్లవ గురువుగా, భర్తగా తన బాధ్యతను నిర్వర్తించాడు, ప్రస్తుతం సీతక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా ఉన్నారు, వీరి వారసత్వమే కుంజసూర్య. వీరు విప్లవ ఉద్యమ సమయంలో ఆదివాసి ప్రాంతంలో బడుగులు, బలహీన వర్గాల ప్రజలకు, శ్రామికులు, రైతు కూలీలకు, భరోసానిస్తూ భూమి లేని పెదలకు వేలాది ఎకరాల భూమిని పంచి పెట్టారు. 


     విప్లవ   ఉద్యమంలో ఉంటూ మార్క్సిజమ్, లేనిన్ ఇజం, మావో సిద్ధాంతాలను వంట పట్టించుకోని కమ్యూనిస్ట్ పార్టీలో చేరి, విభజన అనంతరం  జనశక్తి పార్టీలో క్రియాశీల నేతగా ఎదదిగి విజయవాడలో అరెస్టు అయి జైలు జీవితం అనుభవించి మారోజు వీరన్న స్టాపించిన సిపియూస్ ఐ పార్టీలో పని చేశారు. తెలంగాణ ప్రాంతంలో అనేక కమ్యూనిస్ట్  పార్టీల పోరాట లను చూసి ఈ ప్రాంతంలో చైతన్యం రావాలి అంటే అనగారిణ వర్గాలకు రాజ్యాధికారం రావాలి అంటే  ఆ కులాలను చైతన్యం   చేయాలని దృఢమైన సంకల్పంతో మారోజు వీరన్న లాంటి పోరాట వీరులతో సమ ఆలోచనలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల సంఘాలు మాదిగల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్, ఆదివాసి హక్కుల కోసం తుడుం దెబ్బ, లంబాడీల హక్కుల కోసం నంగారాభరి, గౌడ కులస్తుల హక్కుల కోసం మోకు దెబ్బ, డోలు దెబ్బ ఇలా అనేక  సంఘాలు ఏర్పాటులో కుంజ రాము ది క్రియాశీలక పాత్ర. ఆ చైతన్యమే నేడు తెలంగాణ ఏర్పాటుకు దోహద పడింది.

         

   జల్ జంగిల్ జమీన్ నినాదంతో అటవీ నీరు భూమిపై హక్కు కోసం, మా ఊళ్ళో మా రాజ్యం కోసం కొమురం భీం, బిర్సా ముండా, రాంజీ గొండ్, సొయం గంగులు ఆదివాసి పోరాట యోధుల స్ఫూర్తిని పొంది ఆదివాసీలకు ఆదివాసి ప్రాంతాలు మనుగడలో ఉండాలి అస్తిత్వం దెబ్బతినకుండా ఉండాలంటే ఆదివాసి ప్రజా ఉద్యమాలే కాకుండా సాయిద గెరిల్లా తరహా పోరాటమే శరణ్యమని బావించి భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతానికి స్వయంపాలన కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని శ్రీకాకుళం వరకు గల ఆదివాసి ప్రాంతాలను కలుపుకొని స్వయంపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని తద్వారమే ఆదివాసి ప్రాంతాలు ఆదివాసీల అస్తిత్వం మనుగడలో ఉంటాయని  జనాశక్తి పార్టీ నుంచి బయటకు వచ్చి గేరిల్లా సాయుధ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమని 2004 సెప్టెంబర్ 30న ఆదివాసి లేబరేషన్ టైగర్స్ ఏఎల్టిని స్థాపించి మావోస్టులకు, ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. ఈ ఏ ఎల్ టి ద్వారా ఆదివాసి ప్రాంతంలో  విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో పురోగతి సాధించాలని యువతను సమీకరించి ఆదివాసి ప్రాంతంపై ఆధిపత్యం చెలాయిస్తున్న భూస్వామ్య పెట్టుబడి దారి వర్గాలపై పోరు కొనసాగించారు. ఆదివాసి లిబరేషన్ టైగర్ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో నెమ్మదిగా బలపడుతున్నటువంటి క్రమంలో ఈ సంఘం కనుక బలపడితే ఆదివాసి ప్రాంతంలో ఉన్న వనరులు, అటవీ సంపద ఖనిజాలు  కొల్లగొట్టడం కష్టమవుతుందని భావించిన బూర్జువా వ్యవస్థ ఏఎల్టి వ్యవస్థాపకుడు అయిన కుంజ రాముని  అంతిమంగా అంతం చేయడమే లక్ష్యంగా చేసుకొని తద్వారా మాత్రమే ఈ పోరాటాన్ని ఆపగలమని ప్రభుత్వంతో చేతులు కలిపి 2005 మార్చి 27న ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గొరిమిళ్ళ ఎర్రమ్మ గుట్టలలో కామ్రేడ్ కుంజరాము ఎన్కౌంటర్లో అంతమొందించారు.

      కుంజ రాము ఆదివాసి ప్రాంతాలు స్వయంపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని తెలంగాణ స్వయం పాలనగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కలలుగన్నాడు ఆయన కలలుగన్న స్వయం పాలన నినాదంతో తెలంగాణ ఏర్పడింది కానీ ఇదే తెలంగాణలో గత పది సంవత్సరాలుగా పరిపాలన చేసిన భరాసా ప్రభుత్వం కుంజరాము కలలకు తూట్లు పొడిచి   జిల్లాల విభజన పేరుతో ఆదివాసి ప్రాంతాలను ముక్కలు చక్కలుగా చేసి ఐదవ షెడ్యూల్ ప్రాంత అస్తిత్వమే లేకుండా చేసింది. ఇంతటితో ఆగకుండా  విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో ఆదివాసీల అభివృద్ధి కోసం ఏర్పడ్డ ఐటిడిఏ లను నిరుగార్చి ఎందుకు పనికి రాకుండా చేయటం జరిగింది. ఓపెన్ కాస్ట్ ల పేరుతో, టైగర్ జోన్ల పేర్లతో ఆదివాసి ప్రాంతాలన్ని కుల్లగొట్టబడ్డాయి.  కుంజ రాము కలలుగన్న  ఆదివాసులకు స్వయం పాలన కలగానే మిగిలిపోయింది ఆయన ఆశయ సాధన కోసం ప్రజా ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదివాసి ప్రాంతాల్లో స్వయంపాలన కల్పించి ఆదివాసి ప్రాంతాలను ఆదివాసీల అస్తిత్వాలను నిలబెట్టాలని కోరుకుంటు మార్చ్ 27 న మహబూబాబాద్ జిల్లా పాఖల కొత్తగూడెం, మోకాళ్లపల్లిలో జరిగే కామ్రేడ్ కుంజ రాము వర్ధంతి సభను విజయవంతం చేద్దాం. 


ఇట్లు

వాసం ఆనంద్ కుమార్ 

కాకతీయ యూనివర్సిటీ స్కాలర్ 

9494841254

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు