మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
డాకుమెంట్ రైటర్ ద్వారా అమె లంచం తీసుకుందని సదరు రైటర్ దగ్గర 19,200 లభించాయని ఎసిబి అధికారులు అభియోగం మోపి కేసు నమోదు చేసారు.
తస్లీమా మహ్మద్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సోషల్ మీడియాలో అక్టివ్ గా ఉంటుంది
తస్లీమా పసిప్రాయం లో తండ్రి ని కోల్పోయింది. ఎం సి పి ఐ నాయకుడి గా పని చేసిన సర్వర్ ను నక్సలైట్స్ చంపారు.
ఆమె నిజంగా తీసుకుందా లేక వలపన్ని పట్టుకున్నారా...ఆమె నిజాయితి పరురాలా కాదా అనేది విచారణ లో తేలుతుంది.
అవినీతి నిరోధక శాఖ పట్టుకున్న కేసుల్లో అమాయక వ్యక్తులు బలైన సందర్భాలు ఉన్నాయి. అవినీతిని ఎవరు ప్రోత్స హించలేరు. తస్లీమా అరెస్ట్ వెనకాల భిన్న కథనాలు కూడ వినిపిస్తున్నాయి. ఇవేవి పట్టించు కోకుండా నేరం రుజువు కాకుండా ఏసీబీ ట్రాప్ జరగ గానే నేరస్తు రాలిగా ముద్ర వేసి అంతటితో ఆగకుండా సీతక్క వరకు లంకె పెట్టడం అనైతికం.
నమస్తే తెలంగాణ పత్రిక మొదటి పేజీలో ములుగు ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్కతో తస్లీమా దిగిన ఫోటోను వేసి ఎసిబి వలలో సీతక్క దోస్త్ అంటూ వార్త ప్రచురించింది.
తస్లీమ నేరం ఇంకా రుజువు కాలేదు... ఏసీబీ అభియోగాలు మోపి అరెస్ట్ చేసింది. అదంతా ఓ ప్రాసెస్.
వార్తను వార్తగా మాత్రమే ప్రచురించాలన్న ఇంగితం మరిచి నమస్తే తెలంగాణ పత్రిక మంత్రి సీతక్కతో తస్లీమా దిగిన ఫోటో వేసి ఇదిగో మీ దోస్త్ అంటు చెప్పడం ఏ విలువలకో అర్దం కాని విషయం.
అణగారిన సామాజిక వర్గాని చెందిన సీతక్క తన నియోజక వర్గంలో ఏ స్థాయి వ్యక్తులైనా అందరితో కల్సి మెల్సి కుటుంబ సభ్యురాలిగా ఉంటుంది.
సీతక్కతో ఫోటో దిగని వారంటూ నియోజకవర్గంలో ఉన్నారంటే చాలా అరుదు.
నమస్తే తెలంగాణ పత్రిక ఇప్పటికే చవకబారు వార్తలతో జనంలో చులకనైంది.
పత్రిక యాజమాన్యం ఇట్లా వార్త వేయమంటే సంపాదకవర్గం వేయడమేనా అనేది ప్రశ్న.
ఇది ముమ్మాటికి ఓ వ్యక్తి పరువుకు భంగం కలిగించే విషయం.
సీతక్క ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.
నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఎవరిదో జగమంతా ఎరుగు.
లిక్కర్ దందాలో బ్రోకరిజం చేసి వందల కోట్లు దోచుకుతిన్న వారికంటే ఎక్కువగా సీతక్క తస్లీమాతో ఫోటో దిగడమే తప్పు చేసినట్లా ?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పత్రిక ఓ వెలుగు వెలిగింది కాదనలేం...
తెలంగాణ ప్రజలంతా ఆదరించారు.
తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ఘట్టాలు ఎప్పటికప్పుడు వార్తలుగా అందించి ప్రజల పక్షాన నిలిచింది.
బిఆర్ఎస్ అలనాటి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పత్రిక రంగు మారింది.
ఎంతైనా అధికారంలో ఉన్న వారి స్వంత పత్రిక కదా...
ఈ పత్రికకోసం అనేక మంది పెట్టుబడులు పెట్టినా ఎవరి బాగస్వామ్యం లేకుండా ఒకే ఒక్క కుటుంబం చేతుల్లో కొనసాగుతోంది. సి.ఎల్. రాజం గారి లాంటి పారిశ్రామిక వేత్తలను బలవంతంగా బెదిరించి పత్రిక లాక్కుని భాగస్వామ్యం లేకుండా చేశారు.
అదంతా వేరే కథ
అధికారంలో ఉన్నపుడు నమస్తే తెలంగాణ ను దిగజార్చి బిఆర్ఎస్ కు కరపత్రంగా మార్చారు.
ఇప్పుడు అధికారం కోల్పోయిన అనంతరం ఆ పత్రికను ఇంకా దిగజార్చారు.
ఏ వార్తలు ఇస్తున్నారో ఏం విలువలు పాటిస్తున్నారో ఆ పత్రిక భాద్యతలు నిర్వహిస్తున్న సంపాదక వర్గానికే తెలియాలి.
మహేందర్ కూన
జర్నలిస్ట్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box