అనేక సంవత్సరాలుగా పునర్ నిర్మాణం జరిగిన వేయిస్తంభాల ఆలయ ప్రాంగణలోని కళ్యాణ మండపాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
మహా శివరాత్రి సందర్భంగా మండపాన్ని మహాశివుడికి అంకితం చేసినట్లు ప్రకటించారు.
శివరాత్రి పర్వదిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలోని పునర్ నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో జరిగిన శివపార్వతుల కళ్యాణంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి ఈ చారిత్రిక కట్టడాన్ని పునర్ నిర్మించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమం కొరకు తాను పదవి చేపట్టిన రెండున్నర సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు స్థపతులను, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో చర్చిస్తూ దీనిని పూర్తి చేయడమైనది అన్నారు. ఆనాడు కాకతీయులు సాంస్కృతిక, కళా రంగాలు దేవాలయాలు, గొలుసుకట్టు చెరువులు ఎన్నో నిర్మిం చారని అన్నారు. చారిత్రక దేవాలయమైన రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల ఆలయాన్ని 1324వ సంవత్సరంలో నిర్మించారని పేర్కొన్నారు. ఇంతటి చారిత్రక ఆలయంలోని కళ్యాణమండపాన్ని మరలా ఈ సంవత్సరంలో పునర్నిర్మించటం జరిగిందని అన్నారు. దీనిని ఇంకా వెయ్యి సంవత్సరముల వరకు ఉండే విధంగా నిర్మించారని అన్నారు. పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, స్థపతులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అడిషనల్ డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ స్థానిక అధికారులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box