చట్టసభల్లో బి.సి వాటా సాధన పోరాటంలో రాజకీయ నాయకులు కలిసి రావాలి

 

చట్టసభల్లో బి.సి వాటా సాధన పోరాటంలో రాజకీయ నాయకులు కలిసి రావాలి
ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్


   చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం తెలంగాణలో కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్రకు ప్రతీ గ్రామంలో బ్రహ్మరథం పడుతున్నారని, బి.సి ల నుండి ఎదిగి బి.సి ఓట్లతో గెలిచిన నాయకులు మాత్రం చట్టసభల్లో వాటా కోసం గత 11 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న పాదయాత్ర ఉద్యమానికి మద్దతుగా కలిసి రాకపోవడం బాధాకరమని, చట్టసభల్లో వాటా కోసం జరిగే పోరాటంలో ఆయా పార్టీల నాయకులు కలిసిరావాలని, అలా కలిసిరాని నాయకులను రానున్న కాలంలో బి.సి వ్యతిరేకులుగా భావించాల్సి వస్తుందని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. గత 11 రోజులుగా కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర 222 కిలోమీటర్లు పూర్తి చేసుకొని మంగళవారం నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చేరుకున్న సందర్భంగా మండల నాయకుల సమక్షంలో మహాత్మా జ్యోతరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను పూలమాలలు వేసి మాట్లాడారు. 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బి.సి మహా సభ రాష్ట్ర అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, ఎఐఒబిసి జాక్ వైస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజ, రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు చాపర్తి కుమార్ గౌడ్గే నాయకులు సింగారపు అరుణ, ఎర్ర శ్రీహరి గౌడ్, కె విజయ్ కుమార్, ఎర్రమల్ల శ్రీను లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పనిలో బి.సి లు కీలకపాత్ర పోషిస్తున్న బి.సి లను ఒక కుట్ర ప్రకారమే చట్టసభల్లోకి రాకుండా చేస్తున్నారని, మహిళ బిల్లులో బి.సి కోటా లేకుండా ఉన్న బి.సి నాయకత్వాన్ని నాశనం చేయచూడడాన్ని బి.సి లు అర్థం చేసుకోవాలని అన్నారు. సకల సామాజిక రంగాల్లో సమాన వాటా దక్కి అభివృద్ధి జరగాలంటే బి.సి లకు చట్టసభల్లో వాటా దక్కాలని అన్నారు. బి.సి ల బతుకులు మార్చేందుకు కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్రకు ప్రజలు అండగా నిలవాలని, వాటా సాధించేవరకు విశ్రమించేది లేదని వారన్నారు. 

   ఈ కార్యక్రమంలో పాదయాత్ర నాయకులు 

సింగారపు అరుణ, గడిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీను, ఎర్ర శ్రీహరి గౌడ్, గిరగాని బిక్షపతి గౌడ్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, విశ్వపతి, కుంట విజయ్ కుమార్ తదితరులు పాల్గొనగా, నార్కట్ పల్లి మండలం వివిధ సంఘాల నాయకులు బాసాని నర్సయ్య, బాసాని ఉప్పలయ్య, లక్ష్మయ్య, పైండ్ల రాంచందర్, ఎం.డి షరీఫోద్ధీన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు