రఘునాదపల్లికి చేరిన బిసి జేఏసి నేతల మహా పాద యాత్ర

 

రేపు ఖిలాషాపూర్ లో బి.సి మాహా పాదయాత్ర విరామ సభ
చట్టసభల్లో బి.సి వాటా కోసం తెలంగాణలో 400 కిలోమీటర్ల యాత్ర పూర్తి
బి.సి మహా వీరులను స్మరిస్తూ కొనసాగిన యాత్ర


    సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా సాధనలో బాగంగా చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రారంభమైన బి.సి మహా పాదయాత్ర మంగళవారం రగునాధపల్లికి చేరుకుంది. ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్, హిందూ బి.సి మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ సారథ్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర బుధవారం సాయంత్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ లో విరామం తీసుకోనున్నది. రఘునాథపల్లికి చేరుకున్న పాదయాత్ర బృందానికి రఘునాథపల్లి మాజీ జెడ్పిటిసి రాంబాబు ఘనస్వాగతం పలికి ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా జాక్ నాయకులు సాయిని నరేందర్, బత్తుల సిద్దేశ్వర్లు, మేకపోతుల నరేందర్ గౌడ్ లు మాట్లాడుతూ తరతరాలుగా సమాజ హితం కోసం ఎన్నో సేవలు చేస్తున్న బి.సి లు దేశంలో జరిగిన అన్ని పోరాటాల్లో అసువులు బాసి త్యాగాలు చేశారని అలాంటి బి.సి లకు నేడు అధికారం లేక, ఆత్మగౌరవం లేక, బతకలేక బలిదానాలు చేసుకుంటున్నారని అన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది నిజమైన గణతంత్రం అవుతుందని అన్నారు. అలాంటి నినమైన ప్రజాస్వామ్య గణతంత్ర దేశ నిర్మాణం కోసం చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం మహబూబ్ నగర్ జిల్లా వీరుడు పండుగ సాయన్న గ్రామం మిరుగోన్ పల్లి నుండి ప్రారంభమైన ఈ యాత్ర వీరులు సిరిపురం యాదయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, బెల్లి లలితక్క, ఉ.సా, శ్రీకాంతాచారి, మారోజు వీరన్న, బి. నరసింహారెడ్డి, ఠానూ నాయక్, షేక్ బంధగి, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల ఉద్యమ ప్రాంతాలను సందర్శిస్తూ రఘునాథపల్లికి చేరుకున్నది. 



   పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఈ మహా పాదయాత్రను మహా వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న కోట ఖిలాషాపూర్ లో బుధవారం విరామ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బి.సి మహా పాదయాత్ర ఖిలాషాపూర్ నుండి తిరిగి ప్రారంభమై ఢిల్లీ లాల్ ఖిలా వరకు కొనసాగుతుందని అన్నారు. వారివి కానీ.ఎన్నో పోరాటాల్లో త్యాగాలు చేసిన బి.సి లు నేడు వారి బతుకుల విముక్తి కోసం జరిగే పోరులో కలిసిరావాలని అన్నారు. పార్టీలకు, సంఘాలకు, కులాలకు అతీతంగా బి.సి లు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రగతిశీల శక్తులు బి.సి ల న్యాయమైన పోరాటానికి మద్దతుగా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. 

   ఈ పాదయాత్రలో ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్లు పటేల్ వనజ, వెలుగు వనిత, ఏటిగడ్డ అరుణ, తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్, నాయకులు ఎర్ర శ్రీహరి గౌడ్, బొల్లం లింగమూర్తి, సింగారపు అరుణ, గడిపిపె విమల, బాలస్వామి, ఎర్రమల్ల శ్రీనివాస్, చెన్న శ్రావణ్ కుమార్, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, అనంతుల రాంప్రసాద్, కొంగర నరహరి, సుజాత, సూరారపు రమాదేవి, విశ్వపతి, బత్తుల రాంనర్సయ్య, పర్వత సతీష్, కుంట విజయ్ కుమార్, దుబ్బకోటి ఆంజనేయులు, పంతుల మల్లయ్య, కలాల్ నర్మిహులు, వీరమని, మహేష్, దిడ్డి విష్ణుమూర్తి, కాల్వ మధుబాబు, తాడిచర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు