అశోక్ ఎంపి టికెట్ చుట్టూ
'రాజ'కీయ లొల్లి..!
_చివరకు ఆయనే బరిలోకి.._
_______________________
ఇంతకీ విజయనగరం ఎంపిగా కూటమి తరపు నుంచి ఎవరు తెరపైకి రాబోతున్నారు..సీట్ల అవగానలో ఈ స్థానాన్ని బిజెపికి కేటాయించినా
ఆ పార్టీ ఎంపిగా బరిలోకి దింపేందుకు సరైన అభర్ధే కానరావడం లేదు.ఉన్నవారిలో ఎవరిని నిలబెట్టినా ఇక విజయనగరం స్థానానికి నీళ్ళు వదులుకోవాల్సిందే.
మరి కిం కర్తవ్యం..! చుట్టూ తిరిగి మళ్లీ ఈ ప్రతిష్టాత్మక స్థానం తెలుగుదేశం పరం కావలసిందేనా..
అక్కడికే వద్దాం..ఈ కథంతా ఊహించే విజయనగరం స్థానాన్ని బిజెపికి వదిలినట్లు
కొన్ని వర్గాలు చెబుతున్నాయి.ఈ ఆలోచన అటు చంద్రబాబు నాయుడు..ఇటు అశోక్ గజపతి రాజు చేసినట్లు తెలుస్తోంది.అయితే ఇద్దరూ కలిసి మాత్రం అనుకోలేదు.
ఈ విషయంలో అశోక్ ఆచితూచి పావులు నడిపినట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.అశోక్ ఇలాంటి రాజకీయాలు చేస్తారా.. అనుకోవద్దు.
ఎస్..గతంలో ఆయన ఈ తరహా వ్యూహాలే అమలు చేసిన చరిత్ర ఉంది.1999లో
అప్పటికి ఎంపి గా ఉన్న కొండపల్లి పైడితల్లి నాయున్ని..ఇటు మంత్రిగా ఉన్న పడాల అరుణని ఇద్దర్నీ ఒక్క వేటుతో తప్పించిన ఉదంతం రాజకీయ పరిశీలకులు మర్చిపోయేంత సామాన్యమైనదేమీ కాదు.
అది బెడిసి కొట్టినా ఆయన తగ్గేదేలే అంటూ 2019 లో విజయనగరం స్థానం నుంచి
మీసాల గీతను తప్పించి తన కుమార్తె అదితిని తెరపైకి తెచ్చారు.తీరా అదీ బెడిసి కొట్టింది..ఈ రెండు నిర్ణయాల కారణంగా అశోక్ కాపు ద్వేషిగా ముద్రపడ్డారు.
ఇదంతా చేదు గతం..!
ఇప్పుడు అశోక్ తన పావులను మరింత చాకచక్యంగా కదుపుతున్నారని ఒక వర్గం నమ్మకంగా చెబుతోంది.
నిజమైనా కాకపోయినా
ఇది అలాగే జరిగితే..జరిగే అవకాశం ఉంది కూడా.
ఇంతకీ అసలు కథ చూద్దాం.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా
కూతుర్ని అసెంబ్లీకి పంపాలని అశోక్ దృఢంగా నిర్ణయించుకున్నారు.అలాగే తాను కూడా ఎంపిగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
కానీ ఒకే కుటుంబానికి రెండు టికెట్లా..అనే ప్రశ్న తలెత్తకుండా అశోక్ ముందుగా కూతురి టికెట్ ఖాయం చేసుకున్నారు.
ఒకవేళ అశోక్ ఎంపిగా దిగాలని అనుకుంటే అప్పుడు చంద్రబాబు
ఓకే చెప్పి విజయనగరం స్థానాన్ని మీసాల గీతకి
కేటాయించే ప్రమాదం ఉంటుంది.
అందుకే కూతురి పోటీ నికరం
చేసుకున్నారని అంటున్నారు.
ఇప్పుడు తన టికెట్..
పావులు అటు నుంచి కదులుతున్నాయి.
విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజునే బరిలోకి దింపాలని స్వయంగా బిజెపి కోరుతోంది.ఈ కథ జిల్లా స్థాయి నుంచి షురూ అయి జాతీయ స్థాయి వరకు చేరింది..ఇది విడ్డూరమే కాని అదేగా జరిగింది.తమ పార్టీకి కేటాయించిన స్థానాన్ని మళ్లీ వెనక్కి ఇచ్చేయాలని
అంతటి బిజెపి అనుకోవడం.
ఇప్పటికే ఢిల్లీ నుంచి వర్తమానాలు మొదలయ్యాయి..
అశోక్ గజపతిని ఎంపిగా బరిలోకి దింపాలని సాక్షాత్తు
రాజ్ నాథ్ సింగ్..జెపి నడ్డా
ప్రయత్నాలు ప్రారంభించారు.
మీరే పోటీ చేయాలంటూ
ఆ ఇద్దరూ అశోక్ తో మాట్లాడారంట..బాబుతో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం.ఫైనల్ గా మోడీతో కూడా చెప్పించే అవకాశం ఉంది. ఇంక అప్పుడు తప్పదు.
ఇక్కడ బాబుకి సంబంధించి మరో చిక్కుముడి ఉంది.
నిజానికి బాబు అశోక్ ని అసెంబ్లీ బరిలోకే దింపాలని
గట్టిగా భావించారు.అయితే కూతురు పోటీ విషయంలో
ఆయనకే పట్టుదల ఉందో..
ఇంట్లో పరిస్థితులకు తల ఒగ్గారో బాబును ఒప్పించి అదితి టికెట్ ఖాయం చేయించారు అశోక్.
ఇప్పుడు అశోక్ పోటీ సంగతి.సాక్షాత్తు మోడీ రంగంలోకి దిగి అశోక్ గజపతిని బరిలోకి దింపితే
ఆయన్ని రేపు తన క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక్కడే మరో మెలిక ఉంది.
రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వంలో టిడిపి కలిసినా లేకున్నా..బాబు,మోడీ మైత్రి కొనసాగినా.. బెడిసికొట్టినా
అశోక్ మాత్రం తన టీములో కొనసాగేలా మోడీ భావిస్తున్నారని సమాచారం.
మొత్తానికి అశోక్ గజపతి పోటీ..ఆయన టికెట్ చుట్టూ
ఇన్ని రాజకీయాలు నడుస్తున్నాయి.
*_సురేష్ కుమార్..జర్నలిస్ట్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box