తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది..ఎంపి విజయసాయి రెడ్డి

 


రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు  చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

బీజేపీ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆకాశానికి ఎత్తేసి పొగడ్తలు

 యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశం వెనకపట్టుపట్టిందన్న సాయిరెడ్డి 

కాంగ్రేస్  వాళ్లు అధికారంలో లేనప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగింది

సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు

అబద్ధాలు చెప్పి పదేళ్ల తర్వాత గెలిచారు


2029లో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ చూస్తాం


2024 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా రాహుల్‌ గాంధీ ఓడిపోవడం ఖాయం




అది వెన్నెముక లేని, మోసకారి పార్టీ


రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి... బీజేపీ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆకాశానికి ఎత్తేశారు. యాభై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో దేశం వెనకపట్టుపట్టిందని, వాళ్లు అధికారంలో లేనప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందని అన్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదు. పదేళ్ల తరువాత, అనేక అబద్ధాలు చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. త్వరలోనే అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది. గత ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్‌ గాంధీ 2024లో జరిగే ఎన్నికల్లో ఎక్కడా గెలవరు. ఎక్కడ నుంచి పోటీ చేసినా రాహుల్‌ ఓడిపోతారు. 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ను చూస్తాం. గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ మాయమైపోతుంది. కాంగ్రెస్‌ పరిపాలించిన 50 ఏళ్లలో ఎన్నడూ అభివృద్ధి లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెనకబాటు తనం మనల్ని పీడించింది. కాంగ్రెస్‌ నిద్రాణస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి బాటలో పయనించింది. కాంగ్రెస్‌ వెన్నెముక లేని పార్టీ. కాంగ్రె్‌సను నేను ‘ధోకే బాజ్‌ పార్టీ’ (మోసకారి పార్టీ) అని పిలుస్తాను. వాళ్లు కుటుంబ రాజకీయాలు నడుపుతారు. వాళ్ల డర్టీ పాలిటిక్స్‌ కారణంగానే ప్రజలు వాళ్లకు ఓ గుణపాఠం నేర్పారు. దాని మూలంగానే ఏపీలో 2019 ఎన్నికల్లో వారికి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీ పతనం విస్పష్టంగా కనిపిస్తోంది. 2024లో కాంగ్రె్‌సకు 40 సీట్లు కూడా రావని వాళ్ల స్వంత కూటమి ఇండియా చెపుతోంది’ అని విజయసారెడ్డి అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు