విద్యార్థి స్కూలు బ్యాగులో నక్కిన తాచు పాము

  విద్యార్థి స్కూలు బ్యాగులో దాక్కున్న తాచు పాము

తప్పిన ప్రమాదం



తాచుపాము ఏకంగా ఓ  నిద్యార్థి పుస్తకాల బ్యాగులో దాక్కుంది. అది గమనించకుండా బ్యాగును భుజాలకు తగిలించి స్కూలుకు వెళుతున్న విద్యార్థి బ్యాగు నుండి ఆ పాము జారి పోవడంతో కథ సుఖాంతం అయింది.  లేదంటే ఆ విద్యార్థికి ప్రమాదం కలిగేది.

మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఈదునూరి విజేందర్‌-మమత కుమారుడు వివేక్‌ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూలు బ్యాగు భుజానికి తగిలించుకుని వెళుతుండగా మార్గ మద్యంలో పాము స్కూలు బ్యాగు నుండి రోడ్డుపైకి జారింది. ఈ విషయం గమనించిన పిల్లలు అది చూసి పాము పాము అంటూ అరిచారు. అప్పటికే రోడ్డు పై పడిన  పాము పారి పోయింది. విద్యార్థికి పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


ALSO READ పరిశోధకులకు పనికొచ్చే  సీనియర్ పాత్రికేయులు  దేవులపల్లి అమర్ రచించిన పుస్తకం "మూడు దారులు "

అంతకు క్రితం రోజు వివేక్ ఇంట్లో పాము దూరింది. దాని కోసం ఇళ్లంతా వెదికినా కనిపించక పోవడంతో పాము బయటికి వెళ్లిందని భావించారు. కాని ఆ పాము విద్యార్థి స్కూలు బ్యాగులో దాక్కున్న విషయం వారు గమనించ లేదు. తెల్లవారి  పాము దాక్కున్న బ్యాగును భుజానికేసుకుని  స్కూలుకు వెళ్తుండగా పాము బయట పడింది. పాము బయటికి వెళ్లి పోయింది కాబట్టి విద్యార్థికి ప్రమాదం తప్పింది. పాము ఆట్లాగే బ్యాగులో ఉంటే బ్యాగు తెరిచినపుడు ఆ విద్యార్థిని కాటేసేది. 

పాములు తిరిగే ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరుగు ప్రదేశాల్లోకి పాములు చేరుతుంటాయి.  హెల్మెట్లు, షూ వంటి వస్తువులు బయట పెడ్తుంటాం వాటిని జాగ్రత్తగా చెక్ చేయాలి. గతంలో ఇలాంటి వస్తువుల్లో పాములు దూరి దాక్కున్న సంఘటనలు ఉన్నాయి.  టూ వీలర్స్, కార్లల్లో కూడ పాములు దాక్కునే ప్రమాదం ఉంది.


ALSO READ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుంది..ఎంపి విజయసాయి రెడ్డి 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు