ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు....ఇది ఇప్పటి విశేషం.
ఒకటో తేదీనే వేతనాలు పడడం చూసి తన భార్య నమ్మడం లేదంటూ రేవంత్‌రెడ్డికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ట్వీట్ చేశాడట. ఆ విషయ్నాన్ని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎక్స్ మీడియాలో ట్వీట్ చేసారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు నమ్మలేనంత సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఒకటో తేదీనే పడిన వేతనాలను చూసుకుని మురిసిపోతున్నారు. ఈమధ్యన ఏనాడు ఫస్ట్ తారుఖునే జీతాల ముఖం చూడని వారు బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే పట్టరాని ఆనందంలో తేలిపోతున్నారు. ఉద్యోగుల పరిస్థితే కాదు.. వారిళ్లలోనూ ఇదే పరిస్థితి ఉందని ఓ ప్రభుత్వ ఉద్యోగి చేసిన ‘ఎక్స్’ ద్వారా తెలుస్తోంది.
ఒకటో తేదీనే జీతాలు పడడం చూసి తన భార్య నమ్మలేకపోతోందంటూ ఆ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఎక్స్ చేశాడు. అది చూసిన ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి అయోధ్యరెడ్డి దానిని ఉటంకిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందినట్టు అందులో పేర్కొన్నారు.
సర్కార్ కొలువు లంటేనే ఒకటో తారీఖున జీతాలు పడే నౌకరీలు.
అందుకే వాటి కోసం ఎగబడతారు.
కాని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి మారింది.
జీతాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.
ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ఆతర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటి నుండి గాడి తప్పింది.
జీతాలు ఎప్పుడొచ్చేది తెలియని పరిస్థితి. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుండి సర్కార్ ఆర్థిక వ్యవస్థలో దుబారు పెరిగింది. ఎన్నికల హామీలలో ఉచితాలు పెరిగి పోవడం ప్రభుత్వ రాబడిలో ఎక్కువ శాతం వాటికే వ్యయం కావడం వల్ల ఇతరత్రా చెల్లింపులకు అవరోధాలు ఏర్పడ్డాయి.
తెలంగాణ ఏర్పడం నాటికి మిగులు రాష్ట్రం ఇది అందరికి తెల్సిందే. అయినా ఈ పదేళ్లలో సర్కార్ జీతాలు ఒక్కటో తారీఖున పడ్డ దాఖలాలు లేవు. ఏవో ఒకటి రెండు సంధర్భాల్లో తప్ప ఒకటో తారీఖున జీతాలు పడ లేదు.
సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంబరం ఎల్లకాలం నిలవాలంటే ప్రతి నెలా టంచన్ గా ఒకటో తారీఖున జీతాలు పడాలి. ప్రభుత్వ ఉద్యోగాలుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామి ఇలాగే నిల బెట్టుకోవాలి.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box