కిట్స్ లో ముగిసిన విద్యార్థి సాంకేతిక సింపోజియం "సమ్ శోధిని'23"
కిట్స్ వరంగల్ లో ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐ యస్ టి ఈ) కిట్స్ స్టూడెంట్ విద్యార్థి చాప్టర్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియి సైన్స్, వరంగల్ (కిట్స్ డబ్ల్యు)వారి యొక్క టెక్నికల్ క్లబ్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్)తో పాటుగా 9 విభాగాలు సంయుక్తంగా జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం "సమ్ శోధిని'23" ముగిసింది. ఫిబ్రవరి 2 నుండి 3 వరకు రెండు రోజుల పాటు సమ్ శోధిని నిర్వహించారు.
"సమ్ శోధిని'23" అతిథి సాంకేతిక వక్త, డిట్టో సెక్యూరిటీ CTO,హైదరాబాద్, అజింక్యా లోహకరే జనరేటివ్ AI పై చురుకుగా సాంకేతిక వర్క్‌షాప్ నిర్వహించారు; AI ApI ఇంటిగ్రేషన్ సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ లను తయారు చేయాలని విద్యార్థులకు సూచించారు. అతను సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి సైబర్ భద్రతపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు మరియు ఆవిష్కరణల కోసం విద్యార్థులను ప్రేరేపించారు.
విద్యార్థినీ విద్యార్థులు నైపుణ్యం, దృక్పథం, నాయకత్వ లక్షణాలను మరియు సాఫ్ట్ స్కిల్స్‌పై దృషటిసారించాలని తద్వారా పారిశ్రామిక వేత్త లు గా ఎదగవచ్చు అని వివరించారు.
ఫెస్ట్ కన్వీనర్ మరియు డీన్ విద్యార్థి వ్యవహారాల ప్రొఫెసర్ వి.శంకర్ మాట్లాడుతూ మొత్తం 5000 మంది పాల్గొన్నారని, ఇందులో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి 1500 మంది పాల్గొన్నారని తెలిపారు. మా విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా మరియు నైతికంగా బలంగా తయారు చేయడం మరియు సమాజానికి బాధ్యతగల ఇంజనీర్‌లను తయారు చేయడం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఈ కార్యక్రమంలో కిట్స్ గవర్నింగ్ బాడి మెంబర్ & అసోసియేట్ డీన్, ఎం. నరసింహారావు మాట్లాడుతూ సాంకేతిక సింపోజియంలు సాంకేతిక నైపుణ్యాల మెరుగు పరిచేందుకు, జ్ఞాన అభివృద్ధికి మరియు విద్యార్థుల ఆర్గనైజింగ్ నైపుణ్యాలను విద్యార్థి సమాజంలో సామాజిక ఇంటర్న్‌షిప్‌లను ప్రవేశపెట్టడానికి ఈ రకమైన వేదిక అవసరం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎస్ టి ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ & హెడ్ సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ ఈ, ప్రొ. కె. రాజనరేందర్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి. రమేష్ రెడ్డి, ఫెస్ట్ కన్వీనర్ మరియు డీన్ స్టూడెంట్ ఎఫైర్స్ ప్రొఫెసర్ వి. శంకర్, అసోసియేట్ డీన్, ప్రోగ్రామ్ కో-కన్వీనర్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. నరసింహారావు, హెడ్, ఫిజికల్ సైన్సెస్ & అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, డా.డి. ప్రభాకరా చారి, ఐ యస్ టి ఈ కిట్స్ చాప్టర్ ఛైర్మన్ మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డాక్టర్ హెచ్. రమేష్ బాబు, కో-కోఆర్డినేటర్స్, ఐటిడి, హెడ్ డా. టి. సెంథిల్ మురుగన్ & డా. బి. విజయ్ కుమార్, డీన్‌లందరూ, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు, ఐయస్ టిఈ కిట్స్ విద్యార్థి చాప్టర్ ప్రెసిడెంట్ కె మణి జయంత్, టెక్నికల్ క్లబ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శి బి. బద్రి నారాయణ, 5000 పై చిలుకు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box