వై.ఎస్ జగన్ పై గోనె ప్రకాశ్ రావు ఫైర్
ఎపీలో జగన్ ను సజ్జల నిండా ముంచబోతున్నాడు
టీడీపి జన సేన కూటమికి 151 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదు
జగన్ ను ప్రతి పక్ష హోదా కూడ దక్కదు
చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరైంది కాదని గోనే ప్రకాశ్ రావు ఉన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు జగన్ డైపర్లు వేసుకుంటున్నాడనే విషయం గుర్తుచేసుకోవాలని గోనె ప్రకాశ్ రావు జగన్ రెడ్డికి సూచించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విరుడుపడ్డారు. సజ్జల వలన జగన్ నిండా మునిగిపోబోతున్నాడని విమర్శించాడు. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో జగన్ కు తీవ్ర నష్టం జరుగుతుందని. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి ఏపీలో 151 సీట్లు దాటినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అన్నారు.. ఏపీలో జగన్ కు ప్రతిపక్ష హోదాకూడా దక్కదని, క్రిస్లియన్, మైనార్టీలు ఓటర్లు కాంగ్రెస్ వైపు వెళ్తారని, ఎన్నికల తరువాత జగన్ శాసనసభకు వచ్చే పరిస్థితి లేదని గోనె ప్రకాశ్ రావు రాజకీయ విశ్లేషణ చేసాడు.
ALSO READ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది..ఎంపి విజయసాయి రెడ్డి
బీజేపీ పొత్తు వలన.. టీడీపీ, జనసేన కూటమికి బలం పెరుగుతుందని అన్నారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా జగన్ మాట్లాడటం సరైంది కాదన్నారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయినప్పుడు.. జగన్ డైపర్లు వేసుకుంటున్నాడని గుర్తుచేసుకోవాలని సూచించారు. ఏపీలో వైసీపీ చిత్తుగా చిత్తుగా ఓడిపోతోందని అన్ని సర్వేలు చెప్తున్నాయని, మంత్రులు రోజా, విడుదల రజనీకి కూడా జగన్ టికెట్ ఇవ్వడు. కొత్త ఇంచార్జుల్లో 35 మంది వరకు జగన్ బీఫాం ఇవ్వడని అన్నారు.
తల్లి, చెల్లి పట్ల జగన్ వ్యవహరిస్తోన్న తీరును.. దేవుడు కూడా క్షమించడని గోనె ప్రకాశ్ రావు అన్నారు. హత్య కాదు.. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయనటానికి జగనే ఉదాహరణ అన్నారు. జగన్ను నమ్ముకున్న తెలంగాణ నేతలు రోడ్డున పడ్డారని , జగన్ను నమ్ముకున్న కొండా సురేఖ రాజకీయంగా నష్టపోయారని . జగన్ను వదిలేయటం వలనే ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, పువ్వాడ అజయ్, పుట్ట మధు, బాజిరెడ్డి, సంజీవరావులు రాజకీయంగా కుదురుకున్నారని అన్నారు. సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుని జైలు నుంచి జగన్ బయటకు వచ్చాడన్నారు. రిలయన్స్ పై దాడులు చేసి అదే రిలయన్స్ వ్యక్తి పరిమళ్ కు రాజ్యసభ సీటు ఇచ్చాడని తండ్రిని చంపిన వారితో జగన్ డబ్బులకోసం ఒప్పందాలు చేసుకున్నాడని అన్నారు. స్వార్థం కోసం దగ్గర బంధువు సునీల్ ఎవరో తెలియదన్న వ్యక్తి జగన్ అంటూ గోనె ప్రకాశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box