ఆర్ఖికంగా ఇబ్బందులు ఉన్నా రాష్ర్టంలో కాంగ్రేస్ పార్టి హామి ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు దోఖా ఉండదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.
సచివాలంయో సిఎం రేవంత్ రెడ్డి రూ 500 లకే గ్యాస్, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభించారు. చేవెళ్లలో పథకాలు ప్రారంభించాలని మొదటి నిరమయించారు. అయితే ఎమ్మెల్సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పథకాల ప్రారభించాన్ని సచివాలయానికి మార్చారు. కాంగ్రేస్ పార్టి నేత ప్రియాంక గాంధి ఈ కార్యక్రమానికి గావల్సి ఉండగా చివరి క్షణంలో ఆమె పర్యటన రద్దు అయింది.
ఈసందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కట్టెల పొయ్యి నుండి మహిళలకు విముక్తి కల్గించిన ఘనత ఆనాటి యుపిఏ సర్కార్ దేనని అన్నారు. పేద కుటుంబాల వారికందరికి రూ 1500 లకే గ్యాస్ పథకాలు మంజూరు చేసిందని గుర్తు చేసారు. కేంద్రంలో సర్కార్ అధికారంలో ఉండగా గ్యాస్ సిలిండర్ ధర రూ 400 ఉండేదని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ 1200 లకు పెరిగిందని విమర్శించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box