మేనల్లుడి వివాహానికి సిఎం జగన్ మోహన్ రెడ్డి దూరం



 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహవేడుకలకు ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి హాజరు కాక పోవడం చర్చనీయంగా మారింది. మేనల్లుడి  నిశ్చితార్థానికి హాజరైన జగన్ రెడ్డి వివాహానికి దూరంగా ఉండడం వెనక రాజకీయ కోణాలు వెదుకుతున్నారు.  రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ప్రయి ఆట్లూరితో ఘనంగా జరిగాయి. 

 జోధ్‌పూర్ ప్యాలెస్‌లో రాజారెడ్డి, ప్రియ అట్లూరి వివాహ వేడుకలకు  విఐపిలు కూడ హజరు కాలేదు. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. 16 నుంచి 18 వరకు వివాహ వేడుకలో భాగంగా 16వ తేదీన సంగీత్, మెహందీ కార్యక్రమం జరిగింది. శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజారెడ్డి, ప్రియలు బంధుమిత్రుల సాక్షిగా ఒక్కటయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షర్మిల సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి ఫొటోలు బయటకు రాలేదు కానీ.. హల్దీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.



వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో నూతన వధూవరులు ముస్తాబవగా.. మిగిలినవారంతా పసుపు దుస్తుల్లో కనిపించారు. రాజా రెడ్డి, ప్రియల ఇరుకుటుంబాలు ఈ ఫొటోలలో కనిపించారు. షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్, కూతురు అంజలి, తల్లి విజయమ్మ రాజా రెడ్డి పక్కన ఉండగా.. ప్రియ తల్లిదండ్రులు, ఆమె సోదరుడు మరోపక్క నిలబడి ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.



కాగా, ఫిబ్రవరి 18న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. సాయంత్రం తలంబ్రాల వేడుక జరగనుంది. కాగా, ఈ వివాహ వేడుకలకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కొన్ని పనుల కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదని సన్నిహితులు చెబుతున్నారు. నూతన వధూవరులు ఇంటికి తిరిగి వచ్చాక  జగన్ స్వయంగా వారిని కలిసి ఆశీర్వాదాలు ఇవ్వనున్నట్లు కుటుంబ సన్నిహుతల ద్వారా తెల్సింది.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు