మతోన్మాదంపై
కత్తి దూసిన ఛత్రపతి శివాజీ..!
ఆ జీవితమే
పోరాటాలమయం..
ఔను..అందుకే ఆయన
రాజులకే రాజుగా
అయ్యాడు ఛత్రపతి..
ధ్వజమెత్తిన ప్రజాపతి..!
శివాజీ..
ఆ చక్రవర్తి గురించి
నాలుగు ముక్కలు రాద్దామని
పుస్తకాలు తిరగేస్తే
ఆయన చరిత్ర మొత్తం
ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం..
వర్ణింప నా కలానికి
ఎక్కడిది అంతటి ఆవేశం!?
మొఘలుల భరతం పట్టిన ఘనుడై..
ఔరంగజేబు అహాన్నే దెబ్బతీసిన సింహమై..
తానే సైన్యమై..
తన నాయకత్వంలో
ప్రతి పౌరుడు ఓ సైనికుడై..
వీరాత్వానికే చిరునామా అయ్యాడీ మరాఠా..
అంతటి చక్రవర్తులూ
ఈ వీరసింగం దెబ్బకు ఠా!
ఇంత చేసినదీ రాజ్యకాంక్షతోనా..
మతోన్మాదం పెచ్చుమీరి
మానవతులు,గర్భవతులూ
అవమానాలకు గురవుతుంటే
రక్తం మరిగి
పిన్న వయసులోనే పోరుబాట పట్టి
తుది శ్వాస వరకు
అదే సమరం..
దీనజనోద్ధరనే అహరహం..!
మతోన్మాద శక్తులు
చురకత్తులు ఝుళిపిస్తే
మానవతుల మాంగల్యం
మంటగలుపుతుంటే..
ఆ క్షుద్ర రాజకీయాలకు
రుద్రనేత్రుడై లేచి
మాతృభూమి నుదుటిన
నెత్తుటి తిలకం దిద్దిన
మహావీరుడు..
సార్వభౌముడు..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box