మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర. ఈ జాతర
విశేషమేమిటంటే
విగ్రహారాదనకు తావు లేకుండా పూర్తిగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలతో జరిగే ఈ
జాతరను గిరిజనేతరులు ఎక్కువ భక్తి శ్రద్దలతో దర్శించుకుంటారు.
మేడారం
అంటే కేవలం ఓ జాతర,
ఓ
ఉత్సవం కాదు.
కోట్లాది
మంది భక్తుల నమ్మకం, విశ్వాసం, సంకల్ప సిద్దికి పూనుకునే ఓ శక్తి
స్థలంగా ప్రసిద్ది చెందింది.
దండకారణ్యం
అరణ్య గర్భంలో రెండేళ్ల కోమారు జరిగే
మేడారం జాతరలో ప్రతి ఘట్టం ఓ అపూర్వమే
కాదు
జీవితాంతం
గుర్తిండి పోయే ఉద్విజ్ఞ జ్ఞాపకాలు
నాలుగు
రోజుల పాటు జరిగే మేడారం జాతరలో మొదటి రెండు రోజులు గద్దెలకు చేర్చే కార్యక్రమాలు
ఉంటాయి
జంపన్న, గోవిందరాజు, పగిడిద్ద రాజు, నాగులమ్మతో పాటు సారక్కను మొదటి రోజు గద్దెలకు చేరుస్తారు.
మేడారం
సమీపంలోని కన్నెపల్లి నుండి సారక్కను గద్దెకు చేరుస్తారు.
ఈ
ఘట్టం జాతరలో మొదటి ప్రధాన ఘట్టం కాగా ఈ దృష్యం చూసేందుకు జనం వేయి కళ్లతో ఎంతో
భావోద్వేగంతో ఎదురు చూస్తారు.
ఆదివాసి
పూజారులు ఒక్కో వంశస్తులు గద్దెలకు చేర్చే కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రధానంగా
భక్తులు కొలిచే సమ్మక్క తల్లిని రెండోరోజు
సాయంత్రం చిలుకల గుట్టనుండి తీసుకువస్తారు.
చిలుకల
గుట్టపై కొక్కెర వంశానికి చెందిన ఆది వాసి పూజారి ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర
పోషిస్తాడు.
ఆయనకు
తోడుగా ఇతర పూజారులు సహాయంగా ఉంటారు.
సమ్మక్క
తల్లిని తరలించే సమయంలో చికులగట్టుపైకి ఎవరిని అనుమతించరు.
ఎండోమెంట్,పోలీస్, రెవెన్యూ అధికారులు ఎవరైనా గుట్టకింద తల్లికోసం ఎదురు చూస్తుంటారు.
పూర్తి
వివరాలు వెల్లడించేందుకు ఆదివాసి పూజారులు ఇష్ట పడరు.
మీడియా
వారి నెవరిని చిలుకల గుట్ట పైకి అనుమతించరు.
తల్లిని
గద్దెకు చేర్చే అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది భక్తులు చిలుకల గుట్టనుండి గద్దెల
వరకు బారులు తీరి ఎదురు చూస్తుంటారు.
తల్లిని
గద్దెకు చేర్చే సమయంలో ములుగు ఎస్పి
శబరీశ్ గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
తల్లిని
ఆహ్వానించే క్రమంలో గాలిలోకి కాల్పులు జరపడం ప్రతి జాతరలో ఆనవాయితీగా కొనసాగుతోంది.
జాతరలో
స్వయంగా అన్ని ఏర్పాట్లు
పర్యవేక్షిస్తున్న రాష్ర్ట మంత్రి సీతక్క తో పాటు దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్
కుమార్, ములుగు జుల్లా కలెక్టర్ శ్రీజ, మేడారం జాతర ఉత్సవ కమిటి అధ్యక్షులు
అర్రెం లచ్చులు పటేల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
జాతరలో
పోలీసుల బందోబస్తు చాలా ముఖ్యమైంది.
తొక్కిస
లాటలు జరగకుండా పోలీసులు జనాన్ని అదుపు చేసే భాద్యతలు చేస్తారు.
లక్షలాది
మంది భక్తులు వచ్చే జాతరలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా తొక్కుసలాటలు చోటు చేసుకుంటాయి.
అందుకే
ఇరవై నాలుగు గంటల పాటు అధికారులు కంటికి కునుకు లేకుండా పర్యవేక్షిస్తారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box