బహుజన మహనీయుల స్మరిస్తూ కొనసాగుతున్న బిసి సంఘాల సన్నాహాక యాత్ర
మహనీయుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధించాలి
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ పిలుపు
భారతదేశంలో మెజార్టీ ప్రజలైన శూద్రుల హక్కుల కోసం త్యాగపూరిత పోరాటం చేసిన బహుజన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, బి ఆర్ అంబేద్కర్, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, పెరియార్ రామసామి, పండుగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, బెల్లి లలిత, మారోజు వీరన్న లాంటి వాల్ల ఉద్యమ స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధించాలని ఆల్ ఇండియా ఓబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ పిలుపునిచ్చారు.
చట్టసభల్లో బి.సి వాటా సాధించడం కోసం తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం చేయడం కోసం మూడవ రోజు సాగుతున్న సన్నాహక యాత్రలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి స్థానిక నాయకులతో మాట్లాడి పాదయాత్ర విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మోత్కూరు మండల కేంద్రంలో వివిధ బి.సి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాలర్పించారు ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా కావాలని పోరాటం చేస్తున్న బి.సి లు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కలిగి అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో వాటాతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
వంద కులాలుగా, వంద సంఘాలుగా, వంద ప్రాంతాల్లో విడిపోయిన బి.సి ప్రజలను మహా పాదయాత్ర ద్వారా ఐక్యం చేసి చట్టసభల్లో బి.సి ల వాటా సాధిస్తామని అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధించాడం కోసం త్వరలో చేపట్టనున్న మహా పాదయాత్రలో బి.సి లతోపాటు వివిధ సామాజిక సంఘాలు, ప్రగతిశీల వాదులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. ఈ పాదయాత్ర ను మహబూబ్ నగర్ జిల్లా బహుజన వీరుడు పండుగ సాయన్న వద్ద ప్రారంభమై బహుజన ఉద్యమం సాగించిన యాదాద్రి భువనగిరి జిల్లా బెల్లి లలితక్క మారోజు వీరన్న, శ్రీకాంతాచారి లాంటి అమరవీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధించాలని అన్నారు. చట్టసభల్లో వాటా కోసం జరిగే మహా పాదయాత్రలో విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ఐక్య ఉద్యమాల ద్వారా మహిళా బిల్లులో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. బి.సి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, బయ్యని రాజు, కలిమెల నర్సింహ్మ, బుంగ యాదయ్య, బొడ్డుపెల్లి మైసయ్య, గడ్డమీది రమేశ్ గౌడ్, గనగాని నర్సింహ్మ, సజ్జనం మనోహర్ తదితరులు స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన తండ్రి కాసోజు వెంకటచారితో కలిసి పాదయాత్ర విజయంలో పాలుపంచుకోవాలని మాట్లాడారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మీదుగా అర్వపల్లికి చేరుకున్న సన్నాహక యాత్రకు సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, బి.సి నాయకులు శ్రీకాంత్ గౌడ్ లు స్వాగతం పలికి పాదయాత్రకు మద్దతు పలికారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో కుల, వర్గ జమిల పోరాట యోదుడు కామ్రేడ్ మారోజు వీరన్న విగ్రహం వద్ద చట్టసభల్లో బి.సి ల వాటా సాధిస్తామని నినదించారు. తుంగతుర్తిలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తుంగతుర్తి, బండ రామారం, పసునూరు, పనిగిరి మీదుగా సన్నాహక యాత్ర తిరుమలగిరి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి వైయస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజ, హిందూ బి.సి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు, నాయకులు చాపర్థి కుమార్ గాడ్గే, ఏటిగడ్డ అరుణక్క, సూరారపు రమారెడ్డి, బత్తుల రామనర్సయ్య, కొంగర నరహరి, దుబ్బకోటి ఆంజనేయులు, కె విజయకుమార్, పర్వత సతీష్ కుమార్, డాక్టర్ పరికిపండ్ల అశోక్, లోకాని వెంకటయ్య, పోకల శేఖర్, కూసంపల్లి సోమనర్సయ్య , లక్ష్మయ్య, బొడ్డుపల్లి సతీశ్, వెంకన్న , అంజయ్య, అనంతుల ప్రసాద్ గౌడ్, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box