బహుజన వీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధిస్తాం
ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ పిలుపు
కుల వర్గ నిర్మూలన జమిలి పోరాట యోధుడు, మలిదశ తెలంగాణ ఉద్యమ ఆద్యుడు కామ్రేడ్ మారోజు వీరన్న, నిజాం నిరంకుశ పాలనలో అమరుడైన పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య, నిజాం నిరంకుశ పాలనలో విస్నూరు దొరపై యుద్ధం చేసిన ధీరురాలు చాకలి ఐలమ్మ, నిజాం నిరంకుశ పాలనపై దండయాత్ర చేసిన మహా వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నల స్పూర్తితో పోరాటం సాగించి చట్టసభల్లో బి.సి వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ పిలుపునిచ్చారు. చట్టసభల్లో బి.సి వాటా సాధించడం కోసం తలపెట్టిన మహా పాదయాత్ర విజయవంతం చేయడం కోసం 4వ రోజు సాగుతున్న సన్నాహక యాత్రలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి చౌరస్తాలో పూలే, అంబేద్కర్, మారోజు వీరన్న విగ్రహాలకు, జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో దొడ్డి కొమురయ్య విగ్రహం వద్ద, పాలకుర్తి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ, రఘునాధపల్లి మండలం ఖిలాషాపూర్ లో సర్వాయి పాపన్న కోటను సందర్శించి, పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి స్థానిక నాయకులతో మాట్లాడి పాదయాత్ర విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా కావాలని పోరాటం చేస్తున్న బి.సి లు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కలిగి అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో వాటాతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. జనాభా దామాషా ప్రకారం బి.సి. లకు చట్టసభల్లో వాటా ద్వారానే సకల సామాజిక రంగాల్లో న్యాయం జరుగుతుందని, అభివృద్ధి ప్రణాళికలు రచించే చట్టసభల్లో వాటా లేకుండా అభివృద్ధి సాద్యం కాదని అన్నారు. సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా కావాలని పోరాటం చేస్తున్న బి.సి లు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కలిగి అభివృద్ధి చెందాలంటే చట్టసభల్లో వాటాతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. వంద కులాలుగా, వంద సంఘాలుగా, వంద ప్రాంతాల్లో విడిపోయిన బి.సి ప్రజలను మహా పాదయాత్ర ద్వారా ఐక్యం చేసి చట్టసభల్లో బి.సి ల వాటా సాధిస్తామని అన్నారు. చట్టసభల్లో బి.సి వాటా సాధించాడం కోసం త్వరలో చేపట్టనున్న మహా పాదయాత్రలో బి.సి లతోపాటు వివిధ సామాజిక సంఘాలు, ప్రగతిశీల వాదులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బి.సి మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్లు మాట్లాడుతూ నానాటికీ చట్టసభల్లో బి.సి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో వాటా కోసం జరిగే మహా పాదయాత్రలో విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి జాక్ వైస్ చైర్మన్ వెలుగు వనిత మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా బి.సి లను ఐక్యం చేసి మహిళా బిల్లులో బి.సి వాటా సాధిస్తామని అన్నారు.
తిరుమలగిరికి చెందిన సామాజిక తెలంగాణ మహాసభ నాయకులు కొత్తగట్టు మల్లన్న, పత్తెపురం యాదగిరి, బి.సి సంఘం నాయకులు తన్నీరు రాంప్రభు, శ్రీకాంత్ యాదవ్, కొండకండ్ల మాజీ సర్పంచ్ సుడిగెల హనుమంతు యాదవ్ ముదిరాజ్ సంఘం నాయకులు కాశబోయిన మల్లేష్ ముదిరాజ్, టిఆర్ఎస్ అద్యక్షులు తాటిపెళ్లి మహేష్ కురుమ, అస్నాల మల్లాజీ ఆరె క్షత్రియ పాలకుర్తికి చెందిన గున్నదిరాజుల సాంబయ్య, కమ్మగాని పరమేశ్వర్ గౌడ్, భూమా రంగయ్య, బొమ్మగాని మానస భాస్కర్ తదితరులు సన్నాహక యాత్ర బృందానికి స్వాగతం పలికి పాదయాత్రకు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఒబిసి వైస్ చైర్మన్ పటేల్ వనజ మాట్లాడుతూ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల్లో బి.సి సమాజం అత్యధికంగా దోపిడీకి, అవమానానికి గురవుతుంది బి.సి లేనని, ఎస్సీ, ఎస్టీ లకు, ఆధిపత్య వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయని, బి.సి లకు రిజర్వేషన్లు లేవని, రెండు శాతం పేదలున్న ఆధిపత్య వర్గాలకు 10 శాతం ఇబిసి రిజర్వేషన్లు కల్పించి బి.సి లకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మహిళ బిల్లులో బి.సి వాటా పెట్టాలని, ఐక్య ఉద్యమాల ద్వారా మహిళా బిల్లులో బి.సి వాటా సాధిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఓబిసి వైస్ చైర్మన్లు వెలుగు వనిత, పటేల్ వనజ, నాయకులు వంగ రాములు, దిడ్డి విష్ణుమూర్తి, కనకరాజు, బిక్షపతి, చాపర్థి కుమార్ గాడ్గే, ఏటిగడ్డ అరుణక్క, సూరారపు రమారెడ్డి, బత్తుల రామనర్సయ్య, కొంగర నరహరి, దుబ్బకోటి ఆంజనేయులు, కె విజయకుమార్, పర్వత సతీష్ కుమార్, డాక్టర్ పరికిపండ్ల అశోక్, పైండ్ల వెంకటరమణ రజక, కామునిపెళ్లి నరసింహచారి వడ్రంగి, పోలాస సోమన్న, సంగి వెంకన్న, చిట్యాల సమ్మయ్య, మోత్కుపల్లి విజయ్, బొట్టు శ్రీధర్, పైండ్ల వెంకటరమణ, కామునిపెల్లి నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box