అమరవీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాదిద్ధాం
ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకుల పిలుపు
పీడిత ప్రజల విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత ఉద్యమాలు చేసిన అమరవీరుల స్పూర్తితో చట్టసభల్లో బిసి వాటా సాధించాలని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్లు పటేల్ వనజక్క, వెలుగు వనితక్క, హిందూ బిసి మహాసభ అద్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు, తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, బి.సి మేధావుల ఫోరం అద్యక్షులు వంగ రాములు పిలుపునిచ్చారు. శనివారం హైదరబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి చట్టసభల్లో బి.సి ల వాటా కోసం తలపెట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. రెండవ రోజు సన్నాహక యాత్రలో భాగంగా అమరవీరుల స్థూపం, జల దృశ్యంలో తెలంగాణ టైగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన అమరవీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి ల వాటా సాధించాలని అందుకోసం జరిగే పాదయాత్రలో సబ్బండ కులాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు సాగిన యాత్రలో విద్యార్థి నాయకులు పాలడుగు శ్రీనివాస్, కంచెర్ల భద్రి, బోర సుభాష్ లు మాట్లాడుతూ సకల సామాజిక రంగాల్లో సమాన వాటా దక్కాలంటే చట్టసభల్లో బిసి లకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. చట్టసభల్లో వాటా కోసం జరిగే మహా పాదయాత్రలో విద్యార్థులుగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తామని తెలిపారు. ఐక్య ఉద్యమాల ద్వారా మహిళా బిల్లులో బి.సి వాటా సాధిస్తామని అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, బీబీ నగర్ నుండి భువనగిరికి చేరుకున్న నాయకులు తెలంగాణ ధీర వనిత బెల్లి లలితక్క సమాధి వద్ద పూలు వేసి మాట్లాడారు. బెల్లి లలితక్క, మారోజు వీరన్నల స్పూర్తితో సకల సామాజిక రంగాల్లో బి.సి లకు సమాన వాట సాధిస్తామని, బెల్లి లలితక్క ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. సన్నాహక యాత్రలో భువనగిరి శ్రీనివాస్ నేత, బెల్లి చంద్రశేఖర్, బెల్లి కృష్ణ, డాక్టర్ పరికిపండ్ల అశోక్ తదితరులు స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సలేంద్రం శివయ్య, చాపర్థి కుమార్ గాడ్గే, ఏటిగడ్డ అరుణక్క, అశోక్ పోషం, బత్తుల రామనర్సయ్య, సూరారపు రమారెడ్డి, మట్ట జయంతి గౌడ్, దుగ్గాని సంధ్య, మనోజ్ యాదవ్, పర్వత సతీష్ కుమార్, శ్రీ పరమేశ్వరి, రోజా నేత, జగదీష్ యాదవ్, పెంచాల సతీష్, నల్లెల్ల యాదగిరి, దేశం మహేష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box