కిట్స్ కళాశాలలో మెగా రక్త దాణ శిబిరం

 


 కిట్స్ కళాశాలలో మెగా రక్త దాణ శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ లైన్స్ క్లబ్, హెచ్ డిఎఫ్ సి బ్యాంకు సంయుక్తాధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు 530 యూనిట్ల రక్త దాణం చేసారు.

శిబిరాన్ని సి యస్ ఓ ఫైనల్ ఇయర్ విద్యార్ధి బి విశ్వ తేజ జ్ఞాప కార్థం  నిర్వహించామని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి తెలిపారు.

రక్తదాణ శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ విజయచందర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదానం గొప్ప నిస్వార్థ సేవ అని కిట్స్ విద్యార్థులు అధ్యాపకులు టెక్నాలజీ అభివృద్ధిలోనే కాకుండా మానవుని ప్రాణాలను కాపాడే సామాజిక సేవలో కూడా తమ వంతు బాద్యత పోషించడం అభినందనీయమన్నారు. రక్తదాణం అనేది సమాజంలో పితృ  దేవత భాధ్యత గా ఆయన అభివర్ణించారు.  సమాజంలో రక్తదానం ప్రాణదానం తో సమానమన్నారు.  తల్లి కన్నీళ్లు ప్రాణాలను కాపాడలేవని  కానీ నీ రక్తం మాత్రం ప్రాణాలను కాపాడుతుందని  రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు  సామాజిక భాద్యతగా గుర్తించి ముందుకు రావాలని అన్నారు. 

 ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ  సామాన్యుల భద్రత పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు కిట్స్ వరంగల్ విద్యార్థులు సాంకేతిక విద్యతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.  రక్తదాతలకు  కొన్ని నిమిషాలైతే మరొకరికి ఓ జీవిత కాలం ఇస్తుందని అన్నారు.  క్యాన్సర్, కోవిడ్, ఎయిడ్స్, పర్యావరణ, సురక్షితమైన రైడింగ్, యాంటీ ర్యాగింగ్ మరియు చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు మరియు స్వచ్చ భారత్, చెట్ల పెంపకం వంటి సమాజ సేవల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని పెంపొందించడం కిట్స్ వరంగల్ సాక్ యన్ యస్ యస్ యూనిట్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రిన్సిపాల్ వివరించారు.


ALSOREAD విద్యార్థి స్కూలు బ్యాగులో దాక్కున్న తాచు పాము

ఈ కార్యక్రమంలో  కిట్స్ వరంగల్ యన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్, ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, డా. సిహెచ్. సతీష్ చంద్ర, అదనపు  పి ఓ, యస్. భార్గవి, డీన్ విద్యార్థి వ్యవహారాలు, ప్రొఫెసర్ వి.శంకర్ , అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు & ఈ ఈ ఈ అసోసియేట్ ప్రొఫెసర్, యం. నర్సింహారావు, హెచ్ డి యఫ్ సి మేనేజర్, రాజనర్సయ్య, లయన్స్ క్లబ్ సభ్యులు కె.వెంకటరెడ్డి, వైస్ చైర్మన్, పి. వెంకటనారాయణ గౌడ్,  కార్యదర్శి ఎస్.డి. హబీబ్, సీనియర్ లయన్ వద్దిరాజ్ శ్రీకాంత్, ఐ ఆర్ సి యస్ సభ్యులు ఇ వి శ్రీనివాసరావు, కిట్స్ డిస్పెన్సరీ బృందం డాక్టర్ సుష్మిత, డాక్టర్ తిరుపతి,మెడికల్ సూపర్‌వైజర్ వి. నీలకంఠం,  యన్ యస్ యస్ క్లబ్‌కు చెందిన విద్యార్థి ప్రతినిధులు, సాయిరామ్, అపూర్వ, సిద్దార్థ, మరియు 8వ సెమిస్టర్ సి యస్ ఓ విద్యార్థులు,  వివిధ విభాగాల డీన్‌లు, వివిధ విభాగాల విభాగాధిపతులు, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, ఫిజికల్ సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ డి. ప్రభాకరా చారి,  విద్యార్థి ప్రతినిధులు వరుసగా  ప్రణవ చంద్ర, జయిద్, వర్షిత్, తనుశ్రీ, అభినయ, భద్రి & జయసూర్య,  అధ్యాపక సభ్యులు మరియు 600 పై చిలుకు   విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు