'మాయ'మైనా ఉన్నాడు.._
మదిలో..మనలో..!_
మరణమే లేని యోధుడు..
ఎప్పుడు మరణించాడో
తెలియని వీరుడు..
మరణించి ఉంటే
ఎక్కడ..ఎలా
అసువులు బాసాడో
జాడే లేని అమరుడు..!
సుభాష్ బోస్ మరణం
ఎప్పటికీ తేలని ఓ నిజం(?)
*_తలవంచని ఆయన నైజం.._*
*_స్వతంత్ర సంగ్రామంలో_* *నిఖార్సయిన కమ్యూనిజం!*
బాపూ ఆపేస్తే
సహాయ నిరాకరణ..
సాయుధపోరాటమే
మన త్రికరణ అంటూ
జాతిని జాగృతం చేసి
అరెస్టుకు జంకక
జైల్లోనూ లొంగక..
కారాగారంలో నిరాహారమై
విడుదల పరిహారం సాధించాడు..
స్వరాజ్య సంగ్రామమంటే
సాయుధ పోరాటమని చాటి
*_జాతికి సుభాష్ జీ_*
*_అయ్యాడు నేతాజీ!_*
అజాదు హిందు ఫౌజు
దళపతి నేతాజీ..
భరత జాతి కన్న
మరో శివాజీ..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని
మన స్వర్గమని
ప్రతి మనిషి సైనికుడై
ప్రాణార్పణ చెయ్యాలని
*హిందు ఫౌజు జైహిందని*
*నడిచాడు,నడిపాడు..!*
ఎటు వెళ్ళాడో..
ఎక్కడ తిరిగాడో..
ఎన్ని దేశాలు దాటాడో..
ఎందర్ని కలిసాడో..
స్వరాజ్య సాధనే లక్ష్యమై..
పోరాటమే లక్షణమై..
స్వేచ్చే ఘోషై..
సాయుధపోరాటమే భాషై..
గగనసిగలకెగసి కనుమరుగయ్యాడు
*_జోహార్ జోహార్_*
*_సుభాష్ చంద్ర బోస్..!_*
*అతడే ఒక సైన్యం..*
తాను సైనికుడై జాతి మొత్తం
ఒక సేన కావాలని తలచాడు
అహింస మాట వద్దు..
ఆయుధమే ముద్దన్నాడు..
తెల్లదొరలపై పోరుకు
జాతిని ఏకం చేసి
జగతిని చుట్టి..
అంతటి శక్తిని చుట్టుముట్టి..
*_తానే తల్లి భారతి చేతి ఆయుధమయ్యాడు..!_*
ఆయన జీవితం ఓ హిస్టరీ
*మరణం ఓ మిస్టరీ..*
సాహసమే ప్రమోదమై..
అదే జాతికి ఆమోదమై..
పిలుపు సింహనాదమై..
తన యాత్ర ప్రమాదమై..
ప్రతి చర్య అద్భుత దృశ్యమై
కడకు తానే అదృశ్యమై..
చాలాకాలం వరకు
ఉన్నాడేమో అన్న ఆశ..
ఆయన నింపిన స్ఫూర్తే శ్వాస ఆప్పటికీ..ఇప్పటికీ
ఎప్పటికీ సుభాష్ బోసు..
సెభాష్ బోసు!
*_విప్లవం మరణించదు.._*
*_వీరుడు మరణించడు.._*
*నేతాజీ అమర్ రహే!*
++++++++++++++++++
నేడు నేతాజీ పుట్టినరోజు..
*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box