శ్రీరామ నీ నామమెంతో రుచిరా..

శ్రీరామ 
నీ నామమెంతో రుచిరా..



పాయసం ప్రసాదంగా పుట్టినందుకేనేమో

రామనామంలో 

అంత మాధుర్యం.. !


నిప్పుల నుంచి ఉద్భవించిన 

రామయ్య అలా నిప్పులా ఉండిపోయాడు..

జీవిత పర్యంతం..!


అదే పాయసం మొత్తం 

తన ఒక్కడి జన్మకు మాత్రమే కారణం కారాదన్నట్టు తమ్ముళ్లు లక్ష్మణ 

భరత శత్రుఘ్నుల 

ఉద్భవానికీ తోడ్పడేలా 

పంచి ఇచ్చిన రామయ్య ఇప్పటికీ..ఎప్పటికీ భక్తజనానికి ప్రేమామృతాన్ని 

పంచుతూనే ఉన్న కరుణామూర్తి..!


యాగపురుషుడి వరరూపమున ఉద్భవించిన యుగపురుషుడు..

శ్రీరాముడు..!

అలాంటి రామయ్య ఆలయం

ఆయన పుట్టిన అయోధ్యలో 

రేపటి సంధ్యలో..

ఇదిగో..

మళ్లీ అయోధ్యకాండకు శ్రీకారం..

ప్రతి గుండె గుడిలో

మారుమ్రోగే ఓంకారం..!


సురేష్..9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు