అభ్యంతరకర కంటెంట్ పై యూట్యూబ్ కు సమన్లు జారి చేసిన చైల్డ్ రైట్స్ కమీషన్


 యూట్యూబ్ సోషల్ మీడియా సామ్రాజ్యంలో అత్యధిక జనాదరణ కలిగిన అనుసంధానం. ఇందులో లేని కంటెంట్ ఉండదు. అయితో కొందరు ఇష్టాను సారం అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి కెంటెంట్ పై యూట్యూబ్ నియంత్రణ సరిగ్గా  ఉండదనే విమర్శలు ఉన్నాయి. అభ్యంతరకరమైన కంటెం్ట పై ఫిర్యాదులురావడంతో  చైల్డ్ రైట్ కమిషన్ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది.

యూట్యూబ్ లో పలు రకాల కంటెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ   తల్లి కుమారుల మధ్య అసభ్యకర బంధాలను చూపుతున్న కొన్ని వీడియోలపై నేషనల్ కమీషన్ ఫర్ చైల్డ్ రైట్స్  ప్రొటెక్షన్ కు ఫిర్యాదులు అందాయి.  ఈ కంటెంట్ పై  ఎన్ సిపిసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ALSO READ పోరాటాలతోనే చట్టసభల్లో బిసీలకు రిజర్వేషన్లు 

అటువంటి వీడియోలు పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల జాబితాతో జనవరి 15న వ్యక్తిగతంగా తమ ముందుకు హాజరుకావాలంటూ యూట్యూబ్(YouTube) భారత ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్ మీరా చాట్‌కు రాసిన లేఖలో కోరింది. ఎన్‌సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ.. తల్లి కుమారుల మధ్య అసభ్యకరమైన చర్యలను చూపించే కొన్ని వీడియోలను యూట్యూబ్ లో గుర్తించామని తెలిపారు.

అలాంటి వీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇందులో కొన్ని వీడియోలు పోక్సో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. యూట్యూబ్ ఈ సమస్యను పరిష్కరించాలని, వీడియోలు పోస్ట్ చేసేవారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మకానికి పెట్టడంలాంటిదని అభిప్రాయపడ్డారు. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏ ప్లాట్ ఫాం అయినా శిక్షకు గురికాక తప్పదని హెచ్చరించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు