గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట గురువారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేసారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతోపాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్ సిఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలలపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box