అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా....
• నిబంధనలకు విరుద్ధం గా ఉన్న వర్ణం షాపింగ్ మాల్ ఆక్రమణల తొలగింపు..
• ఆక్రమణలను ఉపేక్షించేది లేదన్న కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా...
నగరంలో సెల్లార్, డివియేషన్, రోడ్డు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు స్వతహాగా తొలగించుకోవాలి.
వరంగల్,23 జనవరి 2024:అక్రమ నిర్మాణాలపై బల్దియా కొరడా ఝులిపించింది. వరంగల్ చౌరస్తా ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధం గా అక్రమ నిర్మాణాలు చేసిన వర్ణం షాపింగ్ మాల్ నిర్మాణాలను బల్దియాకు చెందిన టౌన్ ప్లానింగ్,డి ఆర్ ఎఫ్ సిబ్బంది పోలీస్ వారి సహాకారం తో సిటీ ప్లానర్ వెంకన్న నేతృత్వం లో తొలగించడం జరిగిందని బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు.
ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ బల్దియా వ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు బిల్డర్లు అపార్ట్మెంట్ నిర్మాణదారులు నిబంధనల మేరకు అనుమతులు తీసుకోవాలని ధ్రువీకరించిన నక్ష (ప్లాన్) ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని నగరంలో చాలావరకు అపార్ట్మెంట్ సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు తమ దృష్టి కి వచ్చిందని, సిల్ట్, సెల్లార్ అనుమతులు అనేవి కేవలం పార్కింగ్ కోసం మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, అక్రమంగా నిబంధనలు పాటించని వరంగల్ చౌరస్తాలో గల వర్ణం షాపింగ్ మాల్ యాజమాన్యం బిల్డింగ్ నిర్మాణానికి సిల్ట్ ఫోర్ ప్లస్ అనుమతులు పొంది దానిని కమర్షియల్ అవసరాలకు వినియోగించడమే కాకుండా రోడ్డు వైపు ఉన్న ప్రాంతాన్ని కబ్జా చేసి వాడుకోవడం జరిగిందని, వారు నిర్మించిన సెల్లార్ నిర్మాణానికి అనుమతి లేదని, ఆక్యుపెన్సి సర్టిఫికెట్ పొందకుండా ఆక్రమణలు చేపట్టారని, పూర్తిస్థాయిలో అనుమతి తీసుకోలేని కారణంగా తొలగించడం జరిగిందని అన్నారు. విద్యుత్ కనెక్షన్ ను తొలగించాల్సింది గా ఎన్ పి డి సి ఎల్ వారికి లేఖ రాయడం జరిగిందని, ఆక్రమణ నిర్మాణాల గురించి ఇప్పటివరకు సదరు యాజమాన్యానికి పలుమార్లు నోటీసులు అందజేసినప్పటికీ రాతపూర్వకంగా ఏలాంటి స్పందన లేకపోవడం వల్ల సిల్ట్ పోర్షన్ పార్కింగ్ గోడలు,రోడ్డు ను ఆక్రమించిన ఏరియా లో గల నిర్మాణాలను తొలగించడం జరిగిందని,3 రోజుల్లో నిబంధనల మేరకు పునః నిర్మాణం జరిగేలా చూడాలని ఆదేశించడం జరిగిందని, గ్రేటర్ పరిధిలో ప్రధానం గా మడికొండ,హన్మకొండ, కాశిబుగ్గ,నక్కల గుట్ట,కే యు సి జంక్షన్,కరీంనగర్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, వారం లోగా అట్టి నిర్మాణాలకు సంబందించిన సవరణలు చేపట్టాలని లేకుంటే బల్దియా తరపున కటిన చర్యలు చేపడతామని కమీషనర్ తెలిపారు.
మంగళ వారం ఉదయం వరంగల్ చౌరస్తా నుండి పోచమ్మ మైదాన్ వరకు చేపట్టిన ఆక్రమణ ల తొలగింపు ప్రత్యేక డ్రైవ్ లో ర్యాంప్ ల ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా హన్మకొండ జాలేశ్వరాలయం ప్రక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని తొలగించారు.
ఈ కార్యక్రమంలో బల్దియా కు చెందిన టౌన్ ప్లానింగ్,డి ఆర్ ఎఫ్, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box