పోరాటాల తోనే చట్టసభల్లో బిసిల వాటా

 


మహా పాదయాత్రతోనే చట్టసభల్లో బి సి ల వాటా

ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్

    ప్రజాస్వామిక ఉద్యమాల్లో అత్యున్నత పోరాట రూపమైన మహా పాదయాత్రతో బి.సి లకు చట్టసభల్లో వాటా సాధించగలమని ఆల్ ఇండియా ఒబిసి జాక్ ఛైర్మన్ సాయిని నరేందర్ అన్నారు.

 గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రం బి.సి భవన్ లో మంచిర్యాల జిల్లా బి.సి ఐక్య వేదిక కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షతన జరిగిన బి.సి. మహా పాదయాత్ర సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఉత్పత్తి, శ్రమలో కీలకపాత్ర పోషిస్తున్న బి.సి. తరతరాలుగా దోపిడీకి గురవుతున్నారని, సకల సామాజిక రంగాల్లో జనాభా దామాషా ప్రకారం వాటా దక్కాలంటే చట్టసభల్లో వాటా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. 

ఎన్నో ఉద్యమాలకు నేతృత్వం వహించిన ఆదిలాబాద్ ప్రాంత బి సి టైగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయుల ప్రాంతాలను సందర్శించి వారి త్యాగాలను ప్రజలకు బోధించి స్పూర్తిదాయక ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ బి.సి సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బి సి మోడీ గత పదేళ్లుగా భారతదేశానికి ప్రధానిగా ఉన్నా బి సి ల కోసం ఏమి చేయాలి నిస్సహాయక స్థితిలో ఉన్నాడని, చట్టసభల్లో బి.సి లకు వాటా లేనంతకాలం దేశ ప్రధాని కూడా ఏమి చేయలేడని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన హిందూ బి.సి. మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్లు మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం, చరిత్ర, తెగువ కలిగిన తెలంగాణ ప్రాంతం నుండే బి.సి ప్రజల విముక్తి పోరాటానికి నాంది పలకడం గొప్ప విషయమని, ఆల్ ఇండియా ఒబిసి ఆది సమావేశం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ప్రారంభం కావడం కూడా విజయానికి సూచికని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి దేశంలో ప్రతి ఉద్యమ విజయం వెనుక పాదయాత్ర ఉందని అలాంటి పాదయాత్రతోనే చట్టసభలలో బి సి ల వాటా సాధించగలమని అన్నారు. ఒబిసి జాక్ కు నేతృత్వం వహిస్తున్న సాయిని నరేందర్ కు మంచిర్యాల ప్రజలు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

  


 

ALSO READ యూట్యూబ్ కు సమన్లు ఎందుకో చదవండి

ఈ కార్యక్రమంలో ఎఐఒబిసి జాక్ వైస్ చైర్మన్ దిడ్డి విష్ణుమూర్తి, సభ్యులు చాపర్తి కుమార్ గాడ్గే, ఆకుల సంజీవరావు, బత్తుల ప్రకాష్, తెలంగాణ బి.సి. సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు బొల్లం లింగమూర్తి, బీసీ మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు సిరవేని స్వప్న, రాష్ట్ర కార్యదర్శి గిరగాని భిక్షపతి గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, నాయకులు తవతం సత్యం, కాల్వ మధు బాబు, కిషన్, ఉస్మానియా విద్యార్థి నాయకులు పాలడుగు శ్రీనివాస్, దామెర గోపిక్రిష్ణ, నగరి ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా బి.సి ఐక్య వేదిక నాయకులు సామాజిక న్యాయవేదిక కన్వీనర్ రంగు రాజేశం, సీనియర్ బీసీ నాయకులు కనుకుంట్ల మల్లయ్య, యండి ఇబ్రహీం, మేరు సంఘం మంచిర్యాల మండల అధ్యక్షులు మాడిశెట్టి సత్యనారాయణ, పద్మశాలి సంఘం నాయకులు చలమల్ల అంజయ్య, సుదర్శన్, అఖిల గాండ్ల తెలికుల సంఘం జిల్లా అధ్యక్షులు బుద్ధి చంద్రమౌళి, కురుమ సంఘం జిల్లా నాయకులు సమ్ము రాజన్న, సింగరేణి ఐక్యవేదిక నాయకులు పెద్దపల్లి కోటిలింగం, పెరక సంఘం నాయకులు శంకరయ్య, కాన్కూరు శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు నీరటి రాజన్న, సోమయ్య, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు