కాకతీయకాలని ఫేస్ టూ లో అయోధ్య పూజిత అక్షింతల వితరణ

 




హన్మకొండ కాకతీయకాలని ఫేస్ టూ లో మంగళవారం సాయంత్రం  అయోధ్యలో కోటి రామ నామాలు జపించిన పూజిత అక్షింతల వితరణ భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ద్వారా  అయోధ్య నుండి చేరిన  శ్రీరామ పూజిత అక్షింతలు కాకతీయ కాలనీలోని రామాలయంలో ప్రత్యేక పూజల అనంతరం  అభివృద్ది కమిటి అధ్యక్షులు వద్ది రాజు రంగారావు, ప్రధాన కార్యదర్శి బ్రహ్మదేవర హరి కృష్ణా రావు, కమిటి సబ్యులు శ్యాంసుందర్, ఆర్. రవికుమార్, కూన మహేందర్, కె. వీరేశం అధ్వర్యంలో  ఫేస్ టూ కాలనీకి మంగళ వాయిద్యాల మద్య తీసుకు వచ్చారు. 



పూజిత అక్షింతలు  కాలనీకి చేరిన సందర్బంగా కాకతీయ కాలని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 

కాలనీలో జెండా గద్దెదగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలతో పాటు అక్షింతలు వితరణ చేసి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారి అయోధ్యచిత్ర పఠం, సందేశ పత్రం పంపిణి చేశారు. 



కాలనీలో ఇంటింటికి అయోధ్య రాముని పూజిత అక్షింతల పంపిణీ చేశామని కాలని అధ్యక్షులు వద్దిరాజు రంగారావు తెలిపారు.  కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. 



అయోధ్యలో ఈ నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొననుందని అదే రోజు సాయంత్రం ఇంటింటా మంగళహారుతులు వెలిగించి 108 సార్లు  జై శ్రీరామ్ నామజపం చేయాలని కోరారు. 


ALSO READ- అయోధ్య రామాలాయ నిర్మాణానికి విరాళల వెల్లువ



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు