రేవంత్ రెఢీ

 రేవంత్ రెఢీ..!



రేవంతు..

హస్తం నీ గురుతు..

ఇంతకు ముందు

సైకిల్ అన్నట్టు గురుతు..

ఇప్పుడు తెలంగాణ 

నీ వంతు..

నీ వెనక కాంగ్రెస్ తంతు..

పార్టీలో కొందరి కుప్పిగంతు..

దిక్కుమాలిన దృతరాష్ట్ర సంతు..

నీ కారణంగా

టీఆరెఎస్ గల్లంతు..

చచ్చిన కాంగ్రెస్ పార్టీకి

నువ్విచ్చిన గెలుపే

తియ్యటి షర్బతు..

మళ్లీ దక్కింది ధరావతు..

అందుకే మొదలైంది

అక్కడ మళ్లీ కోతుల కవాతు!


                *_ఈఎస్కే.._*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు