ఆత్మవిశ్వాసాన్ని అహం అనుకోవడం సరికాదు

 ఈ మధ్య కేసీఆర్ తో ఉద్యమ సమయంలో ఆయనతో చాలాకాలం ఉండి పనిచేసినటువంటి ఒక ఆయన వాట్సాప్ లో కేసీఆర్ కు మిత్రమా అని వీడ్కోలు చెప్తూ విమర్శనాత్మకంగా ఒక చిన్న వ్యాసం రాశాడు దానికి నా జవాబు.

మిత్రమా అని అన్నాడుగా వీడుకోలు చెప్పాడుగా పీడ విరుగడ  అయిందన్లేదుగా.


అసలు కెసిఆర్ కానీ కేటీఆర్ గాని ఆ మాటకు వస్తే ఏ రాజకీయ నాయకుడు గాని అంతకన్నా అద్భుతంగా నిస్వార్ధంగా అందరినీ కలుపుకొని వారి స్వార్ధం వదులుకొని, పని వారు చేసి, పేరు వేరే వారికి ప్రతిష్టలంట గట్టి వారిని వారు తక్కువ చేసుకుంటారని అనుకోవడం మూర్ఖత్వం. అలా రాజకీయం చేయబడదు. ఆత్మవిశ్వాసం ఎంతో ఉంటేనే గాని రాజకీయాల్లో ఎదగలేరు. ఆత్మవిశ్వాసాన్ని అహం అనుకోవడం తప్పు. 

నేను కూడా 56 వేల పైచిలుకు పదాల తో కూడిన వ్యాసాలు రాశాను అవన్నీ బైండింగ్ చేసి కేటీఆర్ దీక్షలో ఉంటే ఇచ్చాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ టుడే లో హ్యాన్స్ ఇండియా, ప్రజాతంత్ర లో  మన తెలంగాణా డాట్ ఇన్, లో దక్కన్ విజన్ పేపర్లో 20 కి పైగా తెలంగాణ బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుత పరిపాలన గురించి వ్రాశాను

నేను ఏమీ ఆశించలేదు. 

కెసిఆర్ అవసరం లేదనుకున్నప్పుడు మరి తనే కేసీఆర్కు అంతా అన్ని సలహాలు ఇచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన అని చెప్పుకుంటున్నటువంటి ఈయన గారు ఆయనే ఉద్యమాన్ని ముందుకు ఎందుకు నడపలేకపోయాడు

ఏ ఉద్యమానికైనా ఒక నాయకుడు అవసరం ఆ నాయకత్వ లక్షణాలు కేసీఆర్లో ఉన్నవనడం నిజం 

 సమర్థత గలవాడు కాబట్టి ఇంత దూరం రాగలిగాడు 

అందుకే అంత పైకి ఎదగలిగాడు అంత ఎత్తు పైకి వెళ్లి పడితే ఎక్కువ దెబ్బ తగులుతుంది తగిలింది.

ఇది సైన్స్

 పొలిటికల్ సైన్స్

ఈ రోజు ప్రేమ్ రాజ్ లాంటి వాళ్లు ఎన్ని ఆత్మఘోషలు రాసిన ఏమనుకున్నా కాలేశ్వరం ప్రాజెక్టు చూసిన యాదాద్రి గుడి చూసిన ప్రగతి భవన్ చూసిన అంబేద్కర్ విగ్రహం అమరవీరుల స్తూపం చూసిన హైదరాబాదులో జరిగిన అభివృద్ధి చూసిన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వారి భూమి విలువ పెరిగి కోటీశ్వరులయ్యారు. అందులో అత్యంత బీద వాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంట్లో పని చేసే వర్కర్ ఆస్తి ఐదు పది లక్షల నుంచి కోటి రూపాయలకు పెరిగింది. తెలంగాణ రాకుంటే అభివృద్ధి కాకుంటే ఇది సాధ్యమా. పైవి ఏవి చూసినా ఎన్ని తరాలైనా ఎన్ని పార్టీలు మారినా గుర్తుకు వచ్చేది కేసీఆర్. 

టీఎస్ ఐపాస్, టీ హబ్, కార్డు, ఫాస్ట్ లాంటి అప్లికేషన్స్ సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి 36 ఫ్లైఓవర్లు, మెట్రో ఎక్స్పాన్షన్, హైదరాబాదులో రోడ్ల విస్తీర్ణం, డ్రైనేజీ విస్తీర్ణం, మిషన్ భగీరథ, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏషియాలోనే అన్నిటికన్నా పెద్దది, ఐక్య, జేపీ మోర్గాన్ చేజ్,  మైక్రోసాఫ్ట్ ఇలాంటివి ఎన్నో కంపెనీలు వచ్చి హైదరాబాదులో లక్షలకు పైగా ప్రతి నెల లక్షకు పైగా సంపాదించే లక్షల ఉద్యోగాలు వచ్చి దానిద్వారా మల్టిప్లికేషన్ ఎఫెక్ట్ అయి మన రాష్ట్ర అభివృద్ధి జరిగింది ఇవి ఏవి చూసినా ఎన్ని తరాలైనా కేటీఆర్ గుర్తుకొస్తాడు 

ఈరోజు కూడా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ కేసీఆర్ స్వయంకృత అపరాధం తో (ఇది కూడా నేను ఒప్పుకోను) ఒడినాదు కానీ కాంగ్రెస్ అద్భుత నాయకత్వంతోని కాదు అని ఒప్పుకున్నాడు

అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయంగా చేస్తూ ఎంతో బ్యాలెన్సుడిగా పరిపాలన అందించారు కేసీఆర్ కేటీఆర్ ద్వయం. చేసిన ప్రమాణాల కన్నా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కేసీఆర్. ఇది నిరూపించదగ్గ తిరస్కరించలేని నిజం. 

వరంగల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. రింగ్ రోడ్డు, రామప్ప కు ప్రపంచ హెరిటేజ్ కట్టడం గా గుర్తింపు, లక్నవరం అభివృద్ధి, వరంగల్ నీటి సమస్య దశాబ్దాలుగా ఉన్నటువంటి దాన్ని సంపూర్ణంగా పరిష్కరించడం,  సయెంట్ లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు స్థాపన,  రింగురోడ్డు డెవలప్మెంట్ వల్ల వరంగల్ చుట్టూ ఉన్న కొన్నివేల భూమి గలవాళ్లు మంది కోటీశ్వరులు అయ్యారు. దానితో అక్కడి ఆర్థిక పరిస్థితి ఎన్నో అంచలు పెరిగింది. 20 అంతస్తుల అత్యంత అధునాతనమైనటువంటి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అయినా అక్కడ బీ ఆర్ ఎస్ నాయకులను ఓడించటం శోచనీయం. వరంగల్లో పది సీట్లు వచ్చి ఉంటే ఈరోజు మళ్లీ బి ఆర్ ఎస్ పవర్ లో ఉండేది. అలా ఎందుకు చేశారు ఈ ప్రజలు. ఏదో కేసీఆర్ అహానికి బుద్ధి చెప్పారని ఏమో అని అంటున్నారు. అదంతా తప్పు.    రాష్ట్రానికి ఉన్నటువంటి వనరులతో  ఇప్పుడు సాధించినటువంటి అభివృద్ధి సాధించేందుకు సంక్షేమ కార్యక్రమాలు ఇంత విస్తృతస్థాయిలో చేపట్టేందుకు ఎంతో పరిపాలన దక్షత విజన్ కావాలి. నాలుగు కోట్ల ప్రజలు అంటే రెండు ఆస్ట్రేలియాలతో సన్మానం ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు స్వార్ధపరులు వారి సొంత జెండా ఉన్న వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వనందుకు అది అహం అనుకోవడం తెలివి లేని తనం. పైన సాధించిన అద్భుత అభివృద్ధిని అర్థం చేసుకునే స్థితిలో మన ప్రజలు లేరని జయప్రకాష్ నారాయణ కేటీఆర్ తోనే ఆయన భేటీలో చెప్పారు. అంతకన్నా పెద్ద ఎక్స్పర్ట్ అభిప్రాయం ఎవరిస్తారు.

ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కన్నా అద్భుత పరిపాలన అందించే నాడు తప్పకుండా వారి మీద కూడా పొగుడుతూ వ్యాసాలు కవిత్వం రాస్తాను.



డాక్టర్ ఎం హెచ్ ప్రసాద్ రావు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు