లండన్ లో కాంగ్రేస్ పార్టి విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిపారు.
కాంగ్రేస్ పార్టీ లండన్ లో కాంగ్రెస్ గెలుపు సంబురాలు
ఏక వ్యాఖ్య తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేయాలనీ ఏఐసీసీ కి లేఖ
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు ఘనంగా జరిపారు.
టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబురాల్లో
సుమారు 200 మంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కార్యదర్శి శ్రీధర్ నీలా సభాధ్యక్షులు గ జరిగిన కార్యక్రమం లో వివిధ రంగాల్లో స్థిర పడ్డ డాక్టర్ లు, ఇంజనీర్ లు, శాస్త్రవేత్త లు, విద్యార్థులు పాల్గొని కాంగ్రెస్ విజయావశ్యకతను వివరించారు.
అడ్వైజరి బోర్డు సభ్యులు ఓరుగంటి కమలాకర్ రావు, గంగసాని ప్రవీణ్ రెడ్డి లు ఈ విజయం ప్రజలందరికి అంకితం అని, బాధ్యతా యుతం గ వ్యవహారిద్దాం అని పిలుపు ఇచ్చారు
.ఏక వ్యాఖ్య తీర్మానం ద్వారా రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేయాలనీ ఏఐసీసీ కోరుతూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం లో కార్యదర్శి శ్రీధర్ మంగళరపు, రాకేష్ బిక్కుమండ్ల, లు సభ నిర్వహించడం లో కీలకం గ పని చేసారు
మహిళ నేతలు మేరీ, సరిత మైనారిటీ నేతలు సయ్యద్, జవహర్ రెడ్డి, కళ్యాణ్, శ్రీనివాస్, ప్రవీణ్, నరేష్, పాల్గొని విజయవంతం చేసారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box