రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి లాంఛనమే తరువాయి


హస్తినలో రేవంత్ రెడ్డి భవితవ్యం


ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావల్సిన సంఖ్యా బలం చేకూరిన కాంగ్రేస్ పార్టి అందుకు సన్నాహాలు ప్రారంభించింది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి  డి.కె. శివకుమర్ , పార్టి ఇన్ చార్జ్ మాణిక్ రావుఠాకూర్ ఇతర పార్టి పరిశీలకులు సీనియర్ నాయకులతో భేటి అయి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

సోమవారం ఉదయం నుండి ఈ కసరత్తు జరుగుతోంది.  మగరంలో రెండు స్టార్ హోటెళ్ల చుట్టూ సందడి నెల కొంది.

సిఎల్పి సమావేశం లాంఛనప్రాయంగానే జరుగుతుందని పార్టి  వర్గాలు భావిస్తున్నాయి. 

పార్టి నిర్ణయం తమకు శిరోధార్యమని సీనియర్ నేతలు చెబుతున్నా తమ మనసులో మాట మాత్రం డికెకు చెప్పారని అవకాశం ఇస్తే తమ పేర్లు కూడ పరిశీలించాలని చెప్పినట్లు సమాచారం.

అయితే అధిష్టానం నుండి ఇప్పటికే రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సంకేతాలు ఉన్నాయి. సిఎల్ పి సమావేశం లాంచనంగా మాత్రమే ఏర్పాటు చేసారని చర్చ జరుగుతోంది. సమావేశంలో  నిర్ణయాన్ని పార్టి అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాఖ్య తీర్మాణం చేస్తారని వినిపిస్తోంది.

సిఎల్పి సమావేశం అనంతరం సీన్ హస్తినకు మారనుంది. హస్తినలోనే సిఎం ను నిర్ణయించనున్నారు.

ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇప్పటికే పార్టి చాలా కసరత్తు చేసింది. పార్టీని అధికారం లోకి తీసుకు రాగలిగిన నేతగా రేవంత్ రెడ్డిని పార్టి కాదనలేని పరిస్థితిలో ఉంది. రేవంత్ రెడ్డి అహో రాత్రులు శ్రమించి కఠోర ధీక్ష బూని 64 సీట్లు గెలిచి ముందు చెప్పినట్లుగా పార్టీని ప్రమాణ స్వీకారానికి సిద్దం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. 

ఇప్పటికైతే పార్టీకి రేవంత్ రెడ్డి కాకుండా మరో నేతను ఎంపిక చేసే ఆలోచన లేదని అంటున్నారు. జాతీయ పార్టీ గనుక పార్టి అధిష్టానం నిర్ణయం లేకుండా ఏవి జరగవు. పార్టి అధిష్టానం కూడ లాంచనంగా పేరు ప్రకటిస్తుందని రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు.

రేవంత్ రెడ్డికి పార్టి అధిష్టానం తో మంచి  సంభంధాలున్నాయి. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రియాంక గాంధి, సోనియా గాంధీతో పాటు పార్టి అధ్యక్షులు మల్లికార్జున  ఖర్గే రేవంత్ రెడ్డి  పట్ల పూర్తి సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు.

ఒక వేళ భట్టి విక్రమార్క , దామోదర రాజనర్సింహ, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు గట్టిగా పట్టుబడితే వంతుల వారిగా సిఎం పదవి నిర్ణయించడం లేదా ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు కీలక శాఖలు ఇ్వడం జరుగుతుందని ఇప్పటికైతే మొదటి విడతగా నియమితులు అయ్యేది రేవంత్ రెడ్డే నని పార్టి వర్గాలు అభిప్రాయ పడుతున్నాయు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు