అబద్ధాల కె సి ఆర్ ను ఓడించి తెలంగాణ రక్షించుకుందాం

 అబద్ధాల కె సి ఆర్ ను ఓడించి తెలంగాణ రక్షించుకుందాం



దోపిడి ఆగాలి వనరుల పంపిణీ జరగాలి


ఉద్యమకారుల వేదిక సదస్సు లో ప్రొఫెసర్లు కోదండరామ్, కూరపాటి వెంకటనారాయణ 



     సబ్బండ వర్గాల త్యాగాలు, 1200 మంది యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి నేను తెచ్చానని అబద్ధాలు చెపుతున్న కె సి ఆర్ పాలనను ఓడించి తెలంగాణను రక్షించుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఛైర్మన్ కూరపాటి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో తడుందెబ్బ జిల్లా అద్యక్షులు చింత కృష్ణ అధ్యక్షతన శనివారం ములుగు జిల్లా కేంద్రంలో పదేండ్ల పాలనలో తెలంగాణ సమస్యలు - పరిష్కారాలు అంశంపై జరిగిన సదస్సు లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాడకో బెల్ట్ షాపుతో, మైనింగ్ మాఫియాతో దోచుకోవడమే కాకుండా బడ్జెట్ లో 30 శాతం కల్వకుంట్ల కుటుంబానికి వారి బంధు వర్గానికి  చేరుతుందని విమర్శించారు. డబ్బు సంచులతో గ్రామాల్లో తిరుగుతున్న బి ఆర్ ఎస్ నాయకులను తరిమికొట్టాలని, కాంగ్రెస్ ను గెలిపించి సోనియాకు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అట్టడుగు వర్గంలో పుట్టి, అత్యంత వెనుకడిన ప్రాంతం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన సీతక్కను గెలిపించుకుంటేనే ములుగు ప్రాంతం అభివృద్ధి చెంది సామాజికన్యాయం జరుగుతుందని అన్నారు. 



    ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జన సమితి రాష్ట్ర అద్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ గత పదేండ్లుగా తెలంగాణను దోచుకున్న బి ఆర్ ఎస్ నాయకుల డబ్బు, మద్యం ప్రలోభాలకు లోనై ఓట్లు వేసి మళ్లీ గెలిపిస్తే ప్రమాదమని, దౌర్జన్య పాలనతో మరింత ఆగమవుతారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భూమిలో సాగు చేసుకుంటున్న రైతులపై దౌర్జన్యం చేస్తున్న బి ఆర్ ఎస్ పాలనలో ఉండే అర్హత లేదని, ప్రశ్నించే వారిపై నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి పాలన కొనసాగిస్తున్న కె సి ఆర్ చట్టపరమైన పాలన చేయడం లేదని అన్నారు. బి ఆర్ ఎస్ పాలనను అంతం చేస్తేనే దోపిడి ఆగి వనరులు ప్రజలందిరికి చెందుతాయని అన్నారు. 

 


  ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర సమన్వయకర్త సాయిని నరేందర్ మాట్లాడుతూ ఎంతో అన్యోన్యంగా ఉండే ములుగు ప్రజల మధ్య బి ఆర్ ఎస్ డబ్బు వెదజల్లి ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. గత జిల్లా పరిషత్ ఎన్నికల నుండే డబ్బు సంచులతో ప్రజలను ప్రలోభాలకు గురిచేసే విధానాన్ని మొదలు పెట్టిన బి ఆర్ ఎస్ నాయకులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరింత డబ్బు వెదజల్లి సీ ఓడించాలని పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. సీతక్క లాంటి బలమైన నాయకురాలు ఓడిపోతే ములుగు ప్రాంతం వారికే నష్టమని అన్నారు. సీతక్కను ఓడించడానికి డబ్బు సంచులతో వచ్చిన్న ప్రాంతేతర ఆధిపత్య వర్గాలు వెంటనే ములుగు ప్రాంతం విడిచి వెళ్ళాలని హెచ్చరించారు. నిజాయితీతో నిఖార్సైన రాజకీయాలు చేస్తూ దొర రాజకీయాలకు, పెద్ద దొర ప్రలోభాలకు లొంగకుండా ఇతర ఎమ్మెల్యేల లాగా బి ఆర్ ఎస్ లో చేరనందునే సీతక్కను ఓడించాలని కుట్ర పన్నారని అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను సంతలో బర్రెలను కొన్నట్లు కొని అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ తెలంగాణలో దుష్ట పాలన కొనసాగిస్తున్న కె సి ఆర్ పతనం పోరాటాల గడ్డ ములుగు నుండే మొదలు కావాలని సీతక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆధిపత్య రాజకీయాలకు, బానిస రాజకీయాలకు అడ్డు కట్ట వేయాలని పిలుపునిచ్చారు. బి సి ముఖ్యమంత్రి అని బి సి ఓట్లను, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగల ఓట్లను కొల్లగొట్టి బి ఆర్ ఎస్ గెలుపుకోసం కుట్ర రాజకీయాలు చేస్తున్న బిజెపి మాటలు నమ్మి బిజెపి కి ఓట్లు వేయరాదని అన్నారు. బిజెపి శ్రేణులు కూడా బి ఆర్ ఎఎస్ ను ఓడించడం కోసం కాంగ్రెస్ కు ఓటు వేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంటే ములుగులో కుట్ర రాజకీయాలు  కొనసాగుతున్న సమయంలో మాజీ మంత్రి పోరిక జగన్ నాయక్, యువ కిషోరం బాదం ప్రవీణ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైన విషయమని, వీరి చేరికతో పార్టీకి చాలా మేలు జరుగుతుందని అన్నారు. 

   


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పోరిక జగన్ నాయక్, గిరిజనాబివృద్ధికి కేటాయించిన 1500 కోట్ల రూపాయల నిధుల్లో 30 శాతం ఖర్చు చేసి మిగతా నిధులను దారి మళ్లించి గిరిజనులను దారుణంగా మోసం చేశారని అన్నారు. గత పాలనలో ఎంతో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణను రక్షించుకోవాలని అన్నారు. నేను మూడు పర్యాయాలు ఎమ్మల్యేగా గెలిచి మంత్రిగా చేసిన కాలం అభివృద్ధి మాత్రమే నియోజకవర్గంలో కనపడుతుందని, గడిచిన పదేండ్ల పాలనలో కె సి ఆర్ కుటుంబం దోచుకొని దాచుకోవడమే తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు.

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాదం ప్రవీణ్ ఇంతకాలం బి ఆర్ ఎస్ పార్టీలో ఉండి పెద్ద దొర బానిసలు చేస్తున్న డబ్బు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి వచ్చానని అన్నారు. యువతను పెద్ద ఎత్తున చైతన్యం చేసి కాంగ్రెస్ ను గెలుపించి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమతిగా ఇస్తానని అన్నారు.   

   ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అద్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతి పాలన కొనసాగించిన కెసిఆర్  టి.ఎస్.పి.ఎస్.సి ని నాశనం చేశారని, అక్రమార్కుల చేతిలో ఆ సంస్థ యువతకు తీరని నష్టం చేసిందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగుల్లో మూడు లక్షల మంది నిరుద్యోగ వయసు అయిపోయిందని మిగతా వారి వయస్సు కూడా దెగ్గరపడి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పరిస్తులు లేకుండా పోయాయని అన్నారు. కెసిఆర్ కు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో లేదని అన్నారు. ఎన్నికల వేళ తప్పు సరిదిద్దుకుంటామని అంటున్న కె టి ఆర్ మాటలు నమ్మడానికి తెలంగాణ నిరుద్యోగులు సిద్ధంగా లేరని అన్నారు. బి ఆర్ ఎస్ దుష్ట పాలన అంతంతోనే మార్పు జరిగి తెలంగాణ అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. 

 


 ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ బి సి న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాల సుధాకర్ మాట్లాడుతూ సబ్బండ వర్గాల పోరాటంతో, సకల జనుల సమ్మెతో, యువత బలిదానాలతో తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలంటే ప్రజల కష్టాలు తెలిసిన సీతక్కను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు వేదిక రాష్ట్ర నాయకురాలు పటేల్ వనజక్క మాట్లాడుతూ యువత ప్రాణ త్యాగాలు చేసి రాజకీయ నిరుద్యోగుడైన కె సి ఆర్ కు ఉద్యోగమిస్తే యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి వారి మరణాలకు కారణమవుతున్న కె సి ఆర్ పాలనను ఓడించాలని పిలుపునిచ్చారు. పోరాటాల గడ్డ ములుగు నియోజకవర్గం రామప్ప నుండి రాహుల్ ప్రచారం ప్రారంభంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని అన్నారు. సీతక్కను గెలిపిస్తే అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు ములుగు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్నో విప్లవ పోరాటాలకు, త్యాగాలకు నిలయమైన ములుగు గడ్డమీద నిస్వార్థ సేవలు అందిస్తున్న సీతక్కను ఓడించడానికి చేస్తున్న కుట్రలను భగ్నం చేసి ఈ ప్రాంత చరిత్రను కాపాడుకోవాలని అన్నారు.  


ఏటూరునాగారం లో


    తెలంగాణను ఆంధ్రలో కలిసిన నాటి నుండి తెలంగాణలో జరుగుతున్న అణచివేత, అన్యాయాల గురుంచి ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు జరిగాయని, రాజ్య దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరులో ఎందరో నేలకొరిగారని, పత్తి రైతుల ఆత్మహత్యలతో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమం, మారోజు వీరన్న నాయకత్వంలో ఏర్పడ్డ తెలంగాణ మహాసభ, పీపుల్స్ వార్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ జనసభ ఎన్నో పోరాటాలు చేసి మరెన్నో త్యాగాలు చేశారని అట్లా సాధించుకున్న తెలంగాణలో కె సి ఆర్ కుటుంబ దోపిడికి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. దుష్ట పాలన అంతం ఉద్యమకారుల, నిరుద్యోగుల పంతం కావాలని, డబ్బు సంచులతో ములుగుకు వచ్చిన వారిని ఈ ప్రాంతం నుండి తరిమి ఈ ప్రాంతానికి ఉన్న పోరాట చరిత్రను రుజువు చేసుకోవాలని అన్నారు. జాతీయ స్థాయి నాయకురాలిగా ఎదిగిన సీతక్కను గెలిపించుకుంటేనే వెనుకబడిన ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెంది సామాజికన్యాయం జరుగుతుందని అన్నారు.

   

   ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్లు సోమ రామమూర్తి, చింతకింది కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,  ములుగు నియోజకవర్గ ఇంచార్జి రవళి, ములుగు జిల్లా సాధన సమితి అద్యక్షులు ముంజాల బిక్షపతి,  టి జె ఎస్ భూపాలపల్లి అద్యక్షులు రత్నం కిరణ్,  న్యాయవాదులు ఇ సత్యనారాయణ, సుందర్ రామ్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, భాస్కర్, చింతనిప్పుల బిక్షపతి, దిడ్డి ధనలక్ష్మి, సద్గుణ, సాంబారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు