నామినేషన్ వేసిన మాజి పోలీస్ కమీషనర్ నాగరాజు

 



 జన సందోహం మద్య నామినేషన్

స్వచ్ఛందంగా కదలిన ప్రజలు 


   స్వచ్ఛందంగా కదిలి వచ్చిన ప్రజలతో భారీ ర్యాలీగా వెళ్లి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ పోలీస్ కమిషనర్ కె ఆర్ నాగరాజు బుధవారం నామినేషన్ వేశారు.

 నియోజకవర్గంలోని కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున్న కదలి రావడంతో వర్ధన్నపేట జనసంద్రంగా మారింది. ప్రజలను కట్టడి చేయడానికి పోలీసులు ఎంత ప్రయత్నం చేసిన నియోజకవర్గం నలుమూలల నుండి తరలి వచ్చిన జనం నాలుగు గంటల పాటు నగరం రోడ్లపై నిలిచారు. 

     నామినేషన్ అనంతరం కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ డబ్బుతో నడుస్తున్న నేటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, నా మీద ఉన్న అభిమానంతో ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం చూస్తే విజయం ఖాయమైందనిపిస్తుందని అన్నారు. దోపిడి పాలన విముక్తి కోసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు వర్ధన్నపేటలో తనను భారీ మెజారిటీతో గెలిపించి కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

వరంగల్ పట్టణానికి అతి చేరువలో ఉన్న వర్ధన్నపేట అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, గత పాలకుల లాగా భూ కబ్జాలు, అక్రమ ఇసుక దందాలతో నియోజకవర్గ ప్రజలను నిర్లక్షం చేయనని అన్నారు. పేదరికం నుండి ఎదిగిన వాడిని, ఉన్నత ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన అనుభవంతో నియోజకవర్గ ప్రత్యేక అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, యువ వికాసం ఆరు పథకాలతో పాటు నియోజకవర్గంలో విద్యా , వైద్య, త్రాగు నీటి అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని, చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా నా సేవలు అందిస్తానని అన్నారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కె సి ఆర్ కుటుంబం భోగాలు అనుభవిస్తూ ప్రజలను మోసం చేసిందని ఆయన పాలనలో ఎమ్మెల్యేలు అత్యంత అవినీతిపరులుగా  మారారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైందని, యువత, రైతుల ఆత్మహత్యలు లేని, అవినీతి లేని పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. 

   నాగరాజుకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర సమన్వయకర్త సాయిని నరేందర్, చాపర్తి కుమార్ గాడ్గే, తుపాకుల దశరథం, న్యాయవాదులు కూనూరు రంజిత్ కుమార్, ఎగ్గడి సుందర్ రామ్, ఎ ఐ సి సి నాయకులు, వరంగల్ పార్లమెంట్ పరిశీలకులు రవీందర్ దాల్వే, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎ ఐ సి సి జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్, వర్ధన్నపేట నియోజకవర్గం పరిశీలకులు దర్మసేన, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వరద రాజేశ్వర్ రావు, బోయినపల్లి దేవేందర్ రావు, పద్మ, సింగారపు అరుణ, మంద రాజు, పిట్టల శ్రీనివాస్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు