మాటల మాంత్రికుడు కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో జనాలను ఆకట్టుకునేందుకు మాస్ డైలాగులు, సామెతలు, ఎదుటి పక్షం వారికి వార్నింగ్ లు ఇస్తూ తన దైన శాలిలో దూసుకుపోతున్నారు. స్తతుపల్లిలో జరిగిన సభలో కెసిఆర్ అంధ్ర రాష్ర్ట ప్రస్తావన తెచ్చి ఈడ డబుల్ రోడ్లు ఆడ సింగిల్ రోడ్లంటూ బాంబు పేల్చారు. అంధ్ర బార్డర్ దాటితో తెలంగాణలో డబుల్రోడ్లు దర్శనమిస్తాయని ఆంధ్రలో మాత్రం సింగిల్ రోడ్లని అ్ననారు.
తెలంగాణ లో విడిపోతే ఎట్లా బతుకుతారోనని ఆంధ్రవాళ్లు భాదపడ్డారని అన్నారు.కరెంట్ ఉండదని కారుచీకట్లు అలుముకుంటాయని భయపెట్టారన్నారు.
విడిపోతే మనం ఎలా బతుకుతామో ఏమో అని వారంతా బాధపడ్డారు. కరెంట్ ఉండదు, కారు చీకట్లు అలుముకుంటాయని భయపెట్టారన్నారు.
ఎ్ననికల సభల్లో ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ కెసిఆర్ జనాలను ఆకట్టుకునే ప్రయత్నాుల చేస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే ఆయన సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వీరయ్య గెలుపు కోసం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
డబుల్ రోడ్ వస్తే తెలంగాణ అని, సింగిల్ రోడ్ వస్తే ఏపీ అని సెటైర్లు వేశారు. ఏపీ రైతులు తమ పంటలను తెలంగాణకు తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box