ములుగులో ఈ సారి ఎగిరేది గులాబీ జెండానే
ములుగు ఎమ్మెల్యే సీతక్కది ప్రచార ఆ్రబాటం తప్ప పనులు చేసింది లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ములుగు నియోజక వర్గానికి చెందిన పలువురు బిజెపి, కాంగ్రేస్ పార్టీల నేతలు బిఆర్ఎస్ పార్టీలోచేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో మంత్రుుల సత్యవతి రాథోడ్ హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్సి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతు ములుగు నియోజకవర్గంలో సిఎం కెసిఆర్ వల్లే అభివృద్ది పనులు జరిగాయని అన్నారు.
ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ కాలేజి ఏర్పాటు జరిగిందని అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే ములుగు జిల్లా బాగా అభివృద్ధి జరిగిందని అన్నానరు.
ములుగు లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా ములుగును జిల్లా చేశారని గుర్తు చేశారు.
సమ్మక్క,సారక్క జాతర ను పెద్ద యెత్తున నిర్వహిస్తున్నారని అన్నారు.
ఐటీసీ ఫ్యాక్టరీ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ములుగు అభ్యర్థిగా పోటీలో నిలిచిన నాగజ్యోతిని గెలిపించాలని కోరారు.
ఎవరెన్ని చెప్పినా నమ్మవద్దని రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని హరీశ్ రావు అన్నారు..
సీతక్క సోషల్ మీడియా లో మాత్రమే ఉంటారని -పని తక్కువ ప్రచారం ఎక్కువని అన్నారు.
నిరుపేద అమ్మాయి నాగజ్యోతి వెంటే నియోజక వర్గం ప్రజలుండాలని అన్నారు.
సీతక్క ఓడిపోతున్నానని తెలిసి ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారని కోపంతో ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోందని ఆమె ఓటమి ఖాయమని అన్నారు.
కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి హార్స్ పవర్ అంటే కూడ తెలియదని హరీశ్ రావు అన్నారు.
వ్యవసాయానికి ఎంత హెచ్ పి మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డన్నారు.
కర్ణాటక లో రెండు గంటలు కూడ కరెంట్ ఇవ్వడం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్పాడన్నారు.
ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు.
కేసిఆర్ హయం లో పల్లెల్లో కరువు లేదని హైదారాబాద్ లో కర్ఫ్యూ లేదని అన్నారు.
కర్ణాటక లో రైతు భందు ఇవ్వని కాంగ్రెస్ ఇక్కడ 15 వేలు ఎలా ఇస్తుందని అన్నారు.
కేసిఆర్ గెలిస్తే 16వేలు రైతు బంధు ఇవ్వటం ఖాయమన్నారు.
ధాన్యం కొనమంటే కేవలం 13 క్వింటాళ్ల కొంటామని చెప్తున్నారని మరి మిగిలిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలన్నారు.
వంద అబద్ధాలు ఆడి సీఎం కుర్చీ దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని అన్నారు.
11 సార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రేస్ పార్టి కనీసం బిందె నీళ్ళు ఇవ్వలేక పోయిందని విమర్శించారు.
కాంగ్రేస్ పార్టి నేతలు కెసిఆర్ ను భూతులు తిడుతున్నారన్నారు. మాకు తిట్టడం చేతకాక కాదని తిడితే రేపటి వరకు తిడుతామని అన్నారు. మాకు సంస్కారం ఉందని అన్నారు.
ఎ న్నికలు వచ్చినప్పుడు బీజేపీ అది చేస్తాం ఇది చేస్తాం చెప్తోందని అయితే ఇంత కాలం అధికారంలో ఉన్న బిజేపి ఎందుకు చేయలేదవని ప్రశ్నించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box