కెసిఆర్ బండారం బయట పెట్టిన మోది

కెసిఆర్ గురించి ఎవరైనా కొత్తగా చెప్పేదేమి ఉండదు
ఎందుకంటే సంవత్సరాల తబడి 
తెలంగాణ ఉద్యమం నడిపించిన వ్యక్తిగా
కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు బాగా ఎరుగుదురు

కాకపోతే ఆయన  రాజకీయ ఎత్తులు జిత్తులు
 అందరికి నచ్చాలని లేదు
అంతగా నమ్మతగిన వ్యక్తి మాత్రం కాదు సుమా
అనేది ఆయన్ని ఎరిగిన వారందరికి తెల్సు
 అందితే అందక పోతే జుత్తు అన్న విదంగా
 కెసిఆర్ వ్యవహార శైలి ఉంటుంది
నిజామాబాద్ సభలో దేశ ప్రధాని నరేంద్ర మోది
 కెసిఆర్ కు సంభందించిన ఓ ఆసక్తి కర మైన 
విషయం వెల్లడించారు

ప్రధాన మంత్రి నరేంద్ర మోది
తెలంగాణ సిఎం కేసియార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు
 బిఆర్ఎస్ పార్టీలో లో కల కలం రేపాయి
నిజామాబాద్ లో జరిగిన బిజేపి పార్టి బహిరంగ సభలో
ప్రధాన మంత్రి నరేంద్ర మోది కెసిఆర్
గుట్టు విప్పి చెప్పటాన్ని బిఆర్ఎస్ శ్రేణులు
 జీర్ణించు కోలేక పోతున్నాయి
జిహెచ్ఎంసి ఎన్నికల అనంతరం
 కెసిఆర్ ఎన్ డిఏలో చేరే ప్రతిపాదనను తీసుకు రాగా
  తాను తిరస్కరించానని అట్లాగే కెసియార్ తనయుడు
 కెటిఆర్ ను రాష్ర్టంలో ముఖ్యమంత్రి చేసేందుకు ఆశీర్వాదం అడిగితే
 కాదన్నానని చెప్పారు
కెసిఆర్ ఎలాంటి వాడో ఆయన స్వార్దపు ఆలోచనలు ఎట్లా ఉంటాయో
ప్రధాన మంత్రి  చెప్పడమే కాక ఎప్పటి లాగే కెసిఆర్ కుటుంబ దోపీడీ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
కెసిఆర్  కుటుంబం దోచుకున్నదంతా కక్కిస్తామని అన్నారు.
సభా ముఖంగా ప్రధాని ఈ విషయాలు వెల్లడించడంతో
వెంటనే ఆయనకు  మంత్రులు కెటిఆర్ తో పాటు హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు
ప్రధాన మంత్రి పచ్చి అబద్దాల కోరని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు
భాజపా కూటమి మునిగే నావ లాంటిదని
అట్లాంటి కూటమిలో ఎట్లా చేరతామని కెటిఆర్ ప్రశ్నించారు
ప్రధాన మంత్రి ఎన్ని అబద్దాలు చెప్పినా ఎన్నికల్లో
గెలుపుతమదే నని కెసిఆర్ హాట్రిక్ సాదించి
మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్నారని  అన్నారు
 
సిద్దిపేటకు రేల్వే లైను తీసుకు రావడంలో
బిజెపి పాత్ర శూన్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు
కెసిఆర్ యూపిఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా
 ఉన్న సమయంలో ఈ రైల్వే లైను మంజూరు చేయించారని అన్నారు
ముఖ్యమంత్రిగా 640 కోట్లు రాష్ర్ట వాటాగా ఇచ్చారని
కాని సొమ్మొకరిది సోకొకరిదంటూ బిజెపి
 ఈ ఘనత తన ఖాతాలో వేసుకుందని విమర్శంచారు.
రైల్వే లైను ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి ఫోటో కూడ వేయలేదని
ప్రోటో కాల్ పాటించకుండా స్థానిక ఎంపీకి కూడ ఆలస్యంగా
 ఆహ్వానం పంపారని ఆయన పోటో కూడ లేదని విమర్శించారు
 
 
 
 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు