నిజం గెలవాలి పేరిట బస్సు యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి

 


 

తెలుగు దేశం పార్టి అధినేత నారా చంద్రబాబు నాయుడు  అరెస్ట్ తో తీవ్ర మనోవేదన చెంది గుండెలాగి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు సతీమని నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపట్టారు.

నారావారిపల్లెలో తన తండ్రి తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి యాత్ర ప్రారంభించారు.

అనంతరం చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక గుండెలు చెదిరి చనిపోయిన అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రవీణ్ రెడ్డి, నేండ్రగుంటలో  చిన్నబ్బ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి వారి కుటుంబ సబ్యులను ఓదార్చారు.

మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు మూడు లక్షల రూపాయల చొప్పున చెక్కులు అంద చేశారు.

తామంతా అండగా ఉంటామని భువనేశ్వరి వారికి భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టి స్వీకరిస్తుందని భువనేశ్వరి పేర్కొన్నారు.

వారానికి మూడు రోజులపాటు ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు.

యాత్రకు ముందు రోజు నారా భువనేశ్వరి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని  నారా వారి పల్లెలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భువనేశ్వరిని చూసి నారావారిపల్లెలో మహిళలు కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును తట్టుకోలేక పోతున్నామన్నారు.

గ్రామస్థులను నారా భువనేశ్వరి ఓదార్చారు. చంద్రబాబు నాయు మచ్చలేని నాయకుడని ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడని న్యాయం గెలుస్తుందని అన్నారు. తానెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు అక్రమ అరెస్టుతో న్యాయం కోసం ప్రజల మద్యకు వచ్చానని అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో తమ కుటుంబం నిద్రాహారాలు లేకుండా ఆందోళనతో గడుపుతున్నామని అన్నారు.

 

 

 

 

 


 

 

 

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు