*
తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ పై ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు - బక్క జడ్సన్ కాంగ్రెస్ లీడర్*
తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ తన గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు వేడుకలను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించారు.తలసాని పుట్టినరోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ… బొకే ఎక్కడ అంటూ గన్ మెన్ పై అగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయి గన్ మెన్ చెంప చెల్లుమనిపించారు,దీంతో షాక్ అయిన సదరు గన్మెన్ నిసహాయంగా మంత్రిని అలాగే చూస్తుండి పోయారు.
ఈ ఘటన పై డ్యూటీ లో ఉన్న కాన్స్టేబుల్ పై చెయ్ చేసుకున్న హోమ్ మంత్రి మహమూద్ ఆలీ పై భారతీయ శిక్షాస్మృతి, 1860, చట్టప్రకారం తనపై విధించిన విధులను నిర్వర్తిస్తున్న ప్రభుత్వ అధికారి లేదా సేవకుడిపై అటువంటి దాడి లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించకుండా కాపాడుతుంది. ఈ చర్యలు కోడ్ సెక్షన్ 353 ప్రకారం శిక్షార్హమైనవి. చట్టం వరుసగా సెక్షన్ 351 మరియు 350 కింద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు - బక్క జడ్సన్ కాంగ్రెస్ లీడర్
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box