ఇదంతా ఏ సిరాతో..!?

 


ఇదంతా ఏ సిరాతో..!?


నాకైతే అర్థం కావట్లేదు..


ఆయన టెర్రరిస్టా..


అంతర్జాతీయ స్మగ్లరా..


మాఫియా డానా..


నాలుగైదు హత్యలు చేసి

తప్పించుకు తిరుగుతున్న 

నేరస్థుడా..


కనీసం ఫ్యాక్షనిస్టు 

కూడా కాడే..


ఇంట్లో బాంబులు 

తయారుచేశాడా..


దొమ్మీలో పాల్గొన్నాడా..


పోనీ తక్కువలో తక్కువగా

పిక్ పాకేటింగ్ చేశాడా...


సైకిల్ దొంగతనం..

జేబు కటింగ్..


మరి ఇవన్నీ చేసినోళ్లు..

ఇంతకంటే పెద్ద నేరగాళ్లు

ఊళ్ళో బోరవిరుచుకు

తిరుగుతుంటే..

హత్యలు చేసినోళ్లు..

లక్షల కోట్ల స్కాముల్లో

నిందితులుగా ఉన్నవాళ్లు

సైతం బెయిలుపై తిరుగుతుంటే..ఊళ్ళేలుతుంటే..హాయిగా విదేశాలు కూడా వెళ్ళి వస్తుంటే..

ఇటు జడ్జీలతో టీ తాగుతూ..

అటు దేశాధినేతల సరసన కూర్చుని ఫోటోలకు ఫోజులిస్తుంటే..

చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి బెయిల్ రాదెందుకో..!


ఇది న్యాయవ్యవస్థ లోపమా..

ధర్మదేవత నిజంగా కళ్ళకి గంతలు కట్టుకుని ఉందా..


ఇదంతా ఇలా రాశానని ఇదేదో చంద్రబాబుకి అనుకూలంగా రాస్తున్న పెయిడ్ ఆర్టికలనో..

తెలుగుదేశాధినేత అంటే పిచ్చ అభిమానం ఉన్నోన్నో 

అనుకున్నోళ్లు ఉంటారు..

బాబు కెడి ఆంటూ వెంటనే స్టేట్మెంట్లు ఇచ్చేసి జగన్ దేవుడని..అస్సలు అవినీతి మరక అంటని ఒక మహానేతని చిత్రమైన వాదనకు దిగిపోయే 

వెర్రిమొర్రికర్రి అభిమానులు ఎప్పుడూ ఉంటారు.


ఇంతకీ సారాంశం ఏమిటంటే చంద్రబాబు అనే వ్యక్తి

స్కిల్ డెవలప్మెంట్ అనే కాదు

ఏ వ్యవహారంలో గాని తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే.

అయితే అది నిర్ణయించాల్సింది న్యాయస్థానం..!


ఆ న్యాయస్థానంలో ఇంకా విచారణ మొదలు కానేలేదు.

బెయిల్ విషయంలోనే ఇంత తాత్సారం జరుగుతోందన్నదే ఇప్పుడు విషయం.అంత హడావిడిగా అరెస్టు చెయ్యడం..ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు బిల్డప్పు..73 సంవత్సరాల మనిషికి బెయిల్ ఇవ్వడానికి ఇంత తర్జనభర్జన..అరెస్టు చేసినందుకు ఇంత భజన..!

అంతేగాక మునుపెన్నడూ చూడని..జరగని విధంగా

సిఐడి అధికారులు సర్కారు

ప్రాయోజితంగా ప్రెస్ మీట్లు పెట్టి కేసు ఆనుపానులు వివరించడం..


ఇవన్నీ చూస్తుంటే ఇదంతా ప్రభుత్వం..దాన్ని నడిపిస్తున్న పెద్దలు.. అంటి పెట్టుకున్న నాయకులు వ్యూహాత్మకంగా

నడిపిస్తున్న స్టోరీ అని ఇట్టే తెలిసిపోతోంది కదా..

ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇదే చర్చ..!


ఇంతకీ ఈ ఎపిసోడ్ వైసిపికి

మేలా..కీడా..

మంచా..చెడా..

మొత్తానికి మొత్తం వ్యవహారం తేడా.. పాడా..!


నిజానికి చంద్రబాబు కొందరు నాయకుల్లాగా.. ఫ్యాక్షనిస్టు ల్లాగా పోలీసులు రాగానే గుండె పట్టుకుని ఆస్పత్రిలో చేరిపోయే ప్రయత్నం చెయ్యలేదు.అంత పెద్ద వయసులో కూడా జైలుకి వెళ్ళడానికే సిద్ధపడ్డారు.ఇక బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నమా అంటే అది సామాన్య వ్యక్తి నుంచి కరడుగట్టిన తీవ్రవాది వరకు చేసేదే..!


సరే..ఇదంతా ఒక కోణమైతే

చంద్రబాబును అరెస్టు చేసిన ఉత్తరక్షణం నుంచి  వైసిపి నాయకుల ఉత్సాహం పట్టలేకుండా ఉంది.మళ్లీ

ఇందులో ఎన్నో పాయింట్లు..

మొదట చంద్రబాబు అరెస్టు కావడం..ఆయన్ని ఎలాగైనా దోషిగా..న్యాయస్థానం కంటే ముందుగానే ప్రకటించి తద్వారా రానున్న ఎన్నికల్లో ప్రయోజనం పొందడం..

మా నాయకుడే కాదు..మీ నాయకుడూ జైలుకి వెళ్ళాడు సుమా అని తెలుగుదేశం నాయకులను రెచ్చగొట్టడం.. నిజానికి 

మా నేత కడిగిన ముత్యం..

విపక్ష నేతే దేశముదురు

అని జనాన్ని నమ్మించేందుకు

తంటాలు పడడం..ఇదంతా చేస్తూ తమ అధినాయకుని వద్ద మార్కులు కొట్టేయడం..

బిగ్ మిషన్..గ్రేట్ ఎగ్జిబిషన్..!


              *_ఈఎస్కే.._*

                  జర్నలిస్ట్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు