సర్కారు బడుల్లో అల్పాహార పథకం ప్రారంభం

 


సర్కారు బడుల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల కోసం అర్పాహార పథకం

ఈ రోజు నుండి రాష్ర్ట వ్యాప్తంగా ప్రారంభమైంది

ఒక్కొక్క అసెంబ్లి నియోజవర్గంలో ఒక పాఠశాలలో ఈపథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు

నిరుపేద కుటుంబాలకు చెందిన ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించి

వారంతా చదువుపై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో  సీఎం కేసీయార్ ఈ పథకాన్ని ప్రకటించారు

ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడువేల నూటానలభై ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో

విద్యాభ్యాసం చేస్తున్న ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది

వెస్ట్ మారేడ్పల్లి పాఠశాలలో మంత్రి కెటిఆర్ అల్పాహార పథకం ప్రారంభించారు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలోని రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత

పాఠశాలలో మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు

ఈసందర్బంగా మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి

విద్యార్థుల పక్కనే కూర్చుని వారికి అల్పాహారం స్వయంగా తినిపించారు

తొలుతగా దసరా పండగ నుండి ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించగా 

ఎన్నికల నోటిఫికేషన్ వెువడే అవకాశం ఉండడంతో ముందుగానే ఈ పథకం ప్రారంభించారు

రోజుకో రకమైన అల్పాహారాన్ని విద్యార్థులకు అంద చేస్తారు

స్కూలు ప్రారంభానికి నలభై ఐదు నిమిషాల ముందుగానే అల్పాహారం సిద్దం చేస్తారు

సోమవారం ఇడ్లీ సాంబార్ లేదా గోదుమరవ్వ మంగళవారం పూరి ఆలుకుర్మ లేదా టమాటా బాత్,

బుధవారం ఉప్మా సాంభార్ లేదా కిచిడి చట్ని, గురువారం మిల్లట్ ఇడ్లి సాంబార్ లేదా పొంగల్ సాంబార్,

శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ లేదా గోదుమరవ్వ కిచిటీ చట్ని,

 శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్ 

లేదా ఆలు కుర్మ అంద చేయనున్నారు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు